ఒకవేళ మీకు విద్యా సంబంధ పనులు ఏదో ఓ కారణంతో సమయానికి పూర్తి కావడం లేదంటే...దానికో పరిష్కారముంది. వసంత పంచమి నాడు సరస్వతి దేవి చిత్రపటం లేదా విగ్రహాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో అమర్చి ఆశీర్వాదం తీసుకోవాలి.
వాస్తవానికి ఈశాన్యం పూజకు మంచి అనువైంది. కానీ ఏదైనా కారణంతో ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశలో స్థానం లేకపోయినా సరస్వతి దేవిని కటాక్షం పొందేందుకు వసంత పంచమి నాడు ఇంట్లోని ఈశాన్య దిశను శుభ్రం చేసి సరస్వతి దేవి విగ్రహాన్ని ఓ చెక్కబల్లపై ఉంచి ఏర్పాటు చేయాలి. ఆ తరువాత మీరు కూడా ఉత్తరం లేదా తూర్పు దిశవైపు ముఖం ఉంచి..విగ్రహాన్ని వస్త్రం, పూవులతో అలంకరించాలి. ధూపం లేదా దీపం పెట్టి భోగం పెట్టాలి. ఇంటిసభ్యులతో కలిపి విధి విధానాలతో పూజించాలి. తెల్లటి బట్టలు, పసుపు పూలు లేదా కమల పండ్లు సమర్పించాలి. ఆ తరువాత కేసరి పాయసం లేదా శెనగ పిండి హల్వా నైవేద్యంగా పెట్టాలి.
వసంత పంచమి నాడు దేవతల్లో అగ్రదేవుడైన గణపతిని పూజించడం మర్చిపోకూడదు. ఇలా చేయడం వల్ల సరస్వతి దేవి కటాక్షం సదా ఉంటుంది. వసంత పంచమి శుభ ముహూర్తంలో కవి, రచయిత, విలేఖరి, సాహిత్యం, విద్య, కళ రంగాలకు చెందిన వ్యక్తులు సరస్వతి దేవి పూజా చేయడంతో పాటు తమ రంగాల ప్రాక్టీస్ చేయాలి. విద్యార్ధులకు ఇదే అతి పెద్ద పండుగ. విద్యలో బలహీనంగా ఉన్న విద్యార్ధి మనస్పూర్తిగా సరస్వతి దేవిని పూజించాలి.
సరస్వతి దేవి కటాక్షం కోసం ఏం చేయాలి
నెమలి పింఛాన్ని ఖజానాలో ఉంచాలి. ఆ రోజు కొత్త బట్టలు కొనాలి. ప్రేమలో విజయం కోసం శ్రీ కృష్ణుడి ఆలయంలో ప్రార్ధన చేయాలి. మహిళలు పసుపు రంగు గాజులు తొడగాలి. ఈ రోజు నల్ల రంగు బట్టలు అస్సలు ధరించకూడదు. నాన్ వెజ్ తిని గుడి దర్శనం చేయకూడదు. వ్యాపార భాగస్వామికి పసుపు పూలు ఇవ్వాలి. చెట్లు కొట్టకూడదు. మరోవైపు ఓ చెట్టు నాటాల్సి ఉంటుంది. విద్యాదానం చేయాలి. ఇంట్లోని గ్రంథాలు, పుస్తకాలు బహుమతిగా ఇవ్వాలి.
Also read: Shattila Ekadashi 2023: శటిల ఏకాదశి ఎప్పుడు? ఈరోజున నువ్వులను ఎందుకు దానం చేస్తారు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook