Vastu Tips: సమస్యలు ఎప్పటికీ తగ్గడం లేదా, కిచెన్ నుంచి వెంటనే ఈ వస్తువుల్ని తొలగించి చూడండి

Vastu Tips: ఒక్కోసారి సమస్యలు చుట్టూ ఆవహించేస్తుంటాయి. ఎక్కడికి వెళ్లినా పరాజయమే ఎదురౌతుంంటుంది. ఈ పరిస్థితుల్లో వంటగదికి సంబంధించి కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది. కొన్ని వస్తువుల్ని సకాలంలో బయట పాడేయాలి  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 9, 2023, 09:36 AM IST
Vastu Tips: సమస్యలు ఎప్పటికీ తగ్గడం లేదా, కిచెన్ నుంచి వెంటనే ఈ వస్తువుల్ని తొలగించి చూడండి

మనిషి జీవితంలో ఒక్కోసారి అన్ని వైపుల్నించీ నిరాశే ఎదురవుతుంటుంది. ప్రతి పనిలో ఆటంకం కలుగుతుంటుంది. ఇంట్లో ఆర్ధిక కష్టాలు ఎదురౌతాయి. కుటుంబమంతా వ్యాధులబారిన పడుతుంది. ఇలాంటి సమస్యల్నించి విముక్తి పొందాలంటే కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి.

వాస్తుశాస్త్రంలో మనిషి ఎదుర్కొనే వివిధ రకాల సమస్యలకు పరిష్కారముంది. అన్ని సమస్యలకు వాస్తు కారణమని చెబుతుంటుంది. అదే విధంగా ఇంట్లో సమస్యలకు, వ్యాపార, ఉద్యోగాల్లో కష్టాలకు కొన్ని ప్రత్యేకమైన కారణాలుంటాయి. అదే వాస్తు దోషం. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో వంటగదికి ప్రత్యేక స్థానముంది. వంటగదిలో అన్నపూర్ణ నివాసముంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కిచెన్‌లో కొన్ని రకాల వస్తువుల్ని పొరపాటున కూడా ఉంచకూడదు. 

చీపురుని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. కానీ చీపురుని ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో పొరపాటున కూడా ఉంచకూడదు. ఇలా చేయడం అశుభసూచకం. వాస్తుదోషానికి కారణమౌతుంది. కిచెన్‌లో చీపురు ఉంచడం వల్ల కుటుంబసభ్యుల ఆరోగ్యం పాడవుతుంది. అన్నపూర్ణ దేవి కూడా ఆగ్రహం చెందుతుంది.

చాలామంది గిన్నెలు లేదా ప్లేట్లు విరిగినా బయట పారేయకుండా అలానే ఉంచుతుంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇలా చేయడం చాలా అశుభ సూచకం. వంటగదిలో విరిగిన గిన్నెలు లేదా ప్లేట్లు అస్సలు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల అన్నపూర్ణాదేవి కోప్పడుతుంది. ఇంట్లో ధన సంపదలకు ఇబ్బంది కలుగుతుంది.

కిచెన్‌లో అద్దం ఉండకూడదు. దీనివల్ల నెగెటివ్ శక్తులు ప్రసరిస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిలో అద్దం అమర్చడం వల్ల అగ్నికి ప్రతిబింబం అవుతుంది. అంటే అవసరానికి మించి ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. ఇది హానికారకంగా భావిస్తారు.

కిచెన్‌లో మందులు ఎప్పుడూ ఉంచకూడదు. దీనివల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ సంచరిస్తుంది. వ్యాధులు, ఆర్ధిక ఇబ్బందులు వంటివి ఎదురౌతాయి. ఇంట్లో మందుల్ని కిచెన్‌కు దూరంగా ఉంచాలి.

Also read: Vastu Tips: ఉదయం లేవగానే పొరపాటున కూడా ఈ వస్తువులు చూడొద్దు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News