Etela Rajender On CM KCR: హుజూరాబాద్ అన్నింటిలో ఆదర్శం అని.. రేపటి తెలంగాణకు తొలి కేక అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రేపటి భారతీయ జనతా పార్టీ గెలుపునకు హుజూరాబాద్ నాయకులే పునాది కానున్నారని పేర్కొన్నారు. మనిషికి పదవిని బట్టి గౌరవం దొరకదని.. చేసే పనిని బట్టి గౌరవం దొరుకుతుందన్నారు. నియోజకవర్గాల్లో బీజేపీ పోలింగ్ బూత్ సభ్యుల సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గం సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
దేశంలో మొదటి సారిగా బీజేపీ చేపట్టిన వినూత్న కార్యక్రమం ఇది.. దీనిని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు ఈటల రాజేందర్.
బాధలు ఉన్నప్పుడు కుంగిపోవద్దని.. పదవులు ఉన్నప్పుడు పొంగిపోవద్దన్నారు. తాను ఇరవై ఏళ్ల క్రితం ఎలా ఉన్నానో.. ఇప్పుడు అలానే ఉన్నానని అన్నారు. రేపు కూడా అలానే ఉంటానని చెప్పారు.
'నాకు సినిమాలు చూసే అలవాటు లేదు.. మందు తాగను. ప్రజలను కలవడం నాకున్న అలవాటు. అదే నాకు సంతోషం. వారి సమస్య తీర్చడమే అన్నిటికంటే నాకు గొప్ప అనుభూతి. సమస్యలు ఉన్న ప్రజలు ఎక్కడ చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ పరిస్థితి రాకుండా మనం అభాగ్యులకు మద్దతుగా నిలబడాలి. ధరణి వల్ల నష్టపోయిన రైతుల అప్లికేషన్లు తీసుకోండి. వారి తరపున మనం కొట్లడుదాం. కేసీఆర్ పాలన కొనసాగడం పేదప్రజలకు అరిష్టం. మళ్లీ గెలిస్తే చావులు, అణచివేత, హింసించడం తప్పదు.
హుజూరాబాద్‌లో ప్రజలు ఓడించారని.. కేసీఆర్ మానేరు నదిని చెరపట్టారు. ఇసుక తవ్వి ఎడారి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అన్ని సంఘాల భవనాలకు శంకుస్థాపన చేశారు. ఒక్క భవనం కూడా కట్టలేదు. ఇచ్చిన హామీలు అన్ని నాకు తెచ్చి ఇవ్వండి. కొట్లాడదాం. టెంటు వేద్దాం. అధికార పార్టీ నేతలు దొంగలకు సద్ది కట్టే వారు. మనం ప్రజలకు అండగా ఉందాం. సమస్యలు ఉన్నా ప్రజలు ఎక్కడ చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ పరిస్థితి రాకుండా మనం అభాగ్యులకు మద్దతుగా నిలబడాలి.
కేంద్రం ఇస్తున్న ఫసల్ బీమా పథకం కూడా మన రాష్ట్రంలో అమలు చేయడంలేదు. 100 రూపాయల పెట్రోల్‌లో 35 రూపాయలు మాత్రమే అసలు ధర. 41.50 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ వేస్తుంది. 19.50 రూపాయలు మాత్రమే కేంద్రం ట్యాక్స్. ఇంకా ఎన్నికల యుద్ధం తొమ్మిది నెలలే ఉంది. మీరు సద్దులు కట్టుకొని నా వెంట రావాలి. నేను రోజుకో జిల్లా తిరుగుతూ ఉంట. మీ త్యాగం, కమిట్మెంట్ లేకుండా ఏదీ విజయం సాధించదు. రాబోయే విజయంలో మీ పాత్ర ఉండాలి. నన్ను హుజురాబాద్‌కు రావడం లేదని తిట్టుకోవద్దు..' అని ఈటల రాజేందర్ అన్నారు.
Also Read: Prabhas Broke into Tears: షోలో కన్నీటి పర్యంతం అయిన ప్రభాస్, బాలకృష్ణ.. హగ్ చేసుకుని మరీ!
Also Read: Tunisha Sharma Death: తునీషా శవమై ఉంటే సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ తో షీజాన్ ఛాటింగ్.. గంట పాటు అలాగే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook