YSRCP MLA Kannababu on Veera Simha Reddy and Waltair Veerayya Pre Release Events: నందమూరి బాలకృష్ణ హీరోగా వీర సింహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య సినిమాలు ఈసారి సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే ఈ సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. ముందుగా వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులోని కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించాలని భావించారు.
అయితే అనుమతుల కోసం పోలీసులను సంప్రదిస్తే అక్కడ అనుమతి ఇవ్వలేమని ఒంగోలు శివారులో ఏదైనా ప్రాంతంలో పెట్టుకోమని సూచించారు. అలాగే పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడంతో వేరే ప్రాంతంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. విశాఖపట్నంలో కూడా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందుగా ఆర్కే బీచ్ లో నిర్వహించాలని భావించారు. ఈ మేరకు పోలీసులను అనుమతి కోరితే వాళ్లు ముందుగా అనుమతి ఇవ్వలేదు.
దీంతో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ఈవెంట్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్న తరుణంలో మళ్లీ నిర్వాహకులను పిలిచి ఆర్కే బీచ్ లోనే ఈవెంట్ ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని కావాలని చిరంజీవి ఈవెంట్కు అనుమతి ఇచ్చి బాలకృష్ణ ఈవెంట్ కు అనుమతి నిరాకరించారని విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో ఈ విషయం మీద మంత్రి కన్నబాబు స్పందించారు.
బాలకృష్ణ సినిమా ఫంక్షన్ లను అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదన్న ఆయన చిరంజీవి మూవీ ఫంక్షన్ కి ఆర్కే బీచ్ లో నిబంధనలు ప్రకారం అనుమతులు ఇచ్చి ఉంటారని తెలిపారు కన్నబాబు. మాకు బాలకృష్ణ తక్కువ, చిరంజీవి ఎక్కువ కాదన్న ఆయన రోడ్డు మీద సభలు పెట్టకూడదు అనేది జీవో ఉద్దేశమని అంతేకానీ ఎవరి ఫంక్షన్స్ అడ్డుకోవడం మా ఉద్దేశం కాదన్నారు.
గతంలో మంత్రి కన్నబాబు ప్రజారాజ్యం పార్టీ ద్వారానే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అయితే వైయస్సార్ కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తర్వాత వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన మంత్రిగా కూడా ఎన్నికయ్యారు. అయితే తాజాగా ఆయన మంత్రి వర్గ విస్తరణలో పదవి కోల్పోయారు. మొత్తం మీద ఈ వ్యవహారం మీద కన్నబాబు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ అంశం మీద మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.
Also Read: Rohit Shetty Injured: ప్రమాదంలో స్టార్ డైరెక్టర్‌కు గాయాలు.. హుటాహుటిన హాస్పిటల్ కి !
Also Read: Rishabh Pant's knee surgery: రిషబ్ పంత్ కాలికి శస్త్ర చికిత్స.. గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook