Sacked BPO Employee Takes Revenge on Boss: తనను ఉద్యోగంలోంచి తీసేశాడనే కోపంతో బాస్‌ని షూట్ చేశాడు ఒక మాజీ బిపిఓ ఉద్యోగి. దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్న నొయిడాలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఆరు నెలల క్రితమే అనూప్ సింగ్ అనే వ్యక్తి ప్రవర్తన సరిగ్గా లేదనే కారణంతో అతడి మేనేజర్ శార్ధుల్ ఇస్లాం అతడిని ఉద్యోగంలోంచి తీసేశారు. ఉద్యోగంలోంచి తీసేసే విషయంలో తనను తోటి ఉద్యోగుల ముందు అవమానించాడంటూ అనూప్ సింగ్ తన మేనేజర్ శార్ధు్ల్ ఇస్లాంపై ఆగ్రహం పెంచుకున్నాడు.
తన మాజీ బాస్ శార్ధుల్ ఇస్లాంపై కసి పెంచుకున్న అనూప్ సింగ్.. అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే బుధవారం సాయంత్రం శార్ధుల్ వద్దకు వెళ్లిన అనూప్.. అతడిని అతి సమీపంగా కుడి భుజం మధ్య భాగంలో షూట్ చేశాడు. నిందితుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన శార్ధుల్‌ని హుటాహుటిన సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శార్థుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బిపిఓ మేనేజర్‌పై మాజీ ఉద్యోగి కాల్పులు జరిపిన ఘటనపై నొయిడా జోన్ ఏసీపీ సుషీల్ కుమార్ గంగా ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు అనూప్ సింగ్ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని అన్నారు. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం ఆరు నెలల క్రితమే ఉద్యోగంలోంచి తీసేసినప్పటికీ.. అనూప్ సింగ్ తరచుగా ఆఫీసు వద్దకు వస్తున్నాడని తెలిపారు. శార్ధుల్ తనని అవమానించాడనే కారణంతోనే అనూప్ ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది అని సుషీల్ కుమార్ గంగా ప్రసాద్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : Delhi Girl: బ్రేకప్ చెప్పిందని లవర్‌పై యువకుడు కత్తితో దాడి.. వీడియో వైరల్
ఇది కూడా చదవండి : Whatsapp Group: వాట్సాప్ గ్రూప్‌లో నుంచి తీసేశాడని.. అడ్మిన్ నాలుక కోసేశారు
ఇది కూడా చదవండి : Actress Neha Desh Pandey: హీరోయిన్ భర్తకు టాలీవుడ్ ఇండస్ట్రీకి మధ్య డ్రగ్స్ సంబంధాలపై పోలీసుల ఆరా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook