కొద్దిగా రిస్క్ ఉన్నా..లాభాలు ఆర్జించాలంటే షేర్ మార్కెట్ మంచి ప్రత్యామ్నాయం. మీరు కూడా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ ఏడాది మంచి అవకాశముంది. ఇన్వెస్టర్లకు ఐపీవో మంచి లాభాల్ని తెచ్చిపెడుతుంది. ఐపీవో ద్వారా మీ డబ్బుల్ని కొన్ని రోజుల్లోనే రెట్టింపు చేసుకోవచ్చు. ఈ ఏడాది ఐపీవో లాంచ్ చేస్తున్న ప్రముఖ కంపెనీల గురించి తెలుసుకుందాం..
ఓయో ఐపీవో
ఈ ఏడాది ఓయో సంస్థ ఐపీవో లాంచ్ చేయనుంది. ఓయో కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.5 లక్షల కంటే ఎక్కువ హోటల్స్ నడుపుతోంది. ఈ హోటళ్లు 35 దేశాల్లో 40 కంటే ఎక్కువ విభాగాల్లో సేవలు అందిస్తోంది.
గో ఫాస్ట్
ఇక డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ సంస్థ గో ఫాస్ట్ కూడా ఐపీవో లాంచ్ చేస్తోంది. కంపెనీ ఐపీవో ద్వారా దాదాపు 3600 కోట్ల రూపాయలు సమీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ దాదాపు 57 విమానాలు నడుపుతోంది.
మామాఎర్త్
మామాఎర్త్ కంపెనీ కూడా మార్కెట్లో లిస్టింగ్‌కు సిద్ధమౌతోంది. ఈ ఏడాది ఐపీవో తీసుకొస్తోంది. కంపెనీ గత 3 ఏళ్లలో 105 శాతం సీజీఆర్ లాభాల్ని ఆర్జించింది.
స్విగ్గీ
జొమాటో తరువాత స్విగ్గీ కూడా ఐపీవో లాంచ్ చేస్తోంది. స్విగ్గీ కంపెనీ ఇప్పుడు 500 కంటే ఎక్కువ నగరాల్లో వ్యాపారం నిర్వహిస్తోంది. 1.50 లక్షల రెస్టారెంట్లు కంపెనీతో అనుబంధమై ఉన్నాయి. గత 3 ఏళ్లలో కంపెనీ ఆదాయం భారీగా పెరిగింది.
బైజూస్
పిల్లలకు ఆన్లైన్ విద్యను అందించే బైజూస్ కంపెనీ మార్కెట్ లిస్టింగ్‌కు సిద్ధమౌతోంది. కంపెనీ ప్రస్తుతం 5 కోట్ల కంటే ఎక్కువ స్టూడెంట్స్ ఎన్రోల్ అయున్నారు. ఈ ఏడాది లాంచ్ కానున్న అతిపెద్ద ఐపీవో ఇదే కావచ్చు.
Also read: 7th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గమనిక.. డీఏ పెంపు ఎప్పుడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook