India Post Recruitment 2023: ఎలాంటి రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.63,200 జీతం.. వివరాలు ఇవే..

India Post Office Jobs: వివిధ ఖాళీల భర్తీకి ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్‌ చేసింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2023, 11:54 AM IST
India Post Recruitment 2023: ఎలాంటి రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.63,200 జీతం.. వివరాలు ఇవే..

India Post Office Jobs: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. నైపుణ్యం కలిగిన ఆర్టిజన్‌లను ఎంపిక చేయనున్నారు. ఈ పోస్టులకు 9 జనవరి 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్ ఆఫీస్ అధికారిక వెబ్‌సైట్ indiapost.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి. జీతం రూ.63,200 వరకు ఉండనుంది.

ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా 4 ఎంవీ మెకానిక్ పోస్టులు, 1 ఎంవీ ఎలక్ట్రీషియన్, 1 పోస్ట్ అప్‌హోల్‌స్టెరర్, 1 కాపర్ అండ్ టిన్‌స్మిత్ పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఇండియా పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్‌ను చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. అభ్యర్థులు ఈ పోస్ట్‌లలో దేనికైనా దరఖాస్తు చేసుకోవడానికి 100 రూపాయల దరఖాస్తు రుసుమును చెల్లించాలి. ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూకు పిలుస్తారు. 

అర్హతలు:

  • 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు అర్హులు
  • ఈ పోస్టులకు అభ్యర్థి 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 
  • ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సాంకేతిక సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికెట్ ఉండాలి. 
  • అభ్యర్థికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి..?

ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు సూచించిన దరఖాస్తు ఫారం ద్వారా అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం indiapost.gov.in వెబ్ సైట్ ను చెక్ చేయండి. అభ్యర్థులు సంబంధిత పత్రాలతో పాటు దరఖాస్తును  సీనియర్ మేనేజర్ (జాగ్), మెయిల్ మోటార్ సర్వీస్, నెం.-37, గ్రీమ్స్ రోడ్, చెన్నై-600006 చిరునామాకు పంపాలి.

Also Read: Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకి సమ్మె ఎఫెక్ట్.. స్తంభించిన టికెట్ వ్యవస్థ  

Also Read: AP Politics: టీడీపీకి షాక్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News