KIA EV9 Specifications, price and more: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? రెగ్యులర్ ఫార్మాట్ మోడల్ కాకుండా అందరికంటే భిన్నంగా, అందరిలో ప్రత్యేకంగా న్యూ లుక్‌లో కనిపించేలా కొంచెం కొత్త మోడల్ ఏదైనా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారా ? అయితే ఈ కొత్త కారు డీటేల్స్ మీకోసమే.
KIA EV9 Specifications, price and more: ఇండియాలో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన కార్లలో కియా కార్లకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ట్రెడిషనల్ కార్లు కాకుండా కొత్త కంపెనీ, కొత్త రకం కార్లు ఎంచుకోవాలనుకుంటున్న వారి దృష్టిని ఆకర్షిస్తున్న వాటిలో కియా కార్లు కూడా ముందుంటున్నాయి.
Kia EV9 కాన్సెప్ట్ కారు 77.4kWh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. Kia EV6 కారులో ఉన్నదాని కంటే ఈ బ్యాటరీ ప్యాక్ చాలా పెద్దది. ఈ SUVకి సింగిల్ చార్జింగ్ తో దాదాపు 540 కిమీల రేంజ్ ఇస్తుందని అంచనాలు చెబుతున్నాయి.
ఇంతకు ముందెప్పుడూ లేనివిధంగా Kia EV9 కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు డిజైన్లలో కొత్తదనం ఉట్టిపడేలా ఫ్యూచరిస్టిక్ డిజైన్‌లో హెడ్‌లైట్స్‌ని ఏర్పాటు చేశారు.
Kia EV9 కారు 4,929mm పొడవు, 2,055mm వెడల్పు, 1,790mm ఎత్తుతో ఎస్ యూవి కార్లలో భారీ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. తాము ప్రవేశపెడుతోన్న కియా ఈవి9 కారు ఎస్ యూవీ కార్లలో బీస్ట్ వలే కనిపిస్తుందని కియా కంపెనీ చెబుతోంది.
భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ మయం కావడంతో ఫ్యూచర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకుని కియా ప్రవేశపెడుతున్న కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ ఈ కియా ఇవి9 కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కారు.
త్వరలోనే ఢిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా జరగనున్న ఆటో ఎక్స్‌పోలో కియా కంపెనీ ఈ కారును లాంచ్ చేయనుంది.
కొత్తగా కారు కొనాలనుకునే వారు.. అందులోనూ ఈవి కారు కొనాలనుకునే వారికి ఇదొక మంచి ఆప్షన్ అంటున్నారు ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్.