అధిక రక్తపోటు అనేది నిజంగానే ఓ సైలెంట్ కిల్లర్. నిర్లక్ష్యం ప్రదర్శిస్తే గుండె వ్యాధులకు దారితీస్తుంది. సకాలంలో అధిక రక్తపోటు సమస్యకు చెక్ పెట్టకపోతే ప్రాణాంతకం కావచ్చు. అధిక రక్తపోటు సమస్య నుంచి గట్టెక్కేందుకు కొన్ని చిట్కాలున్నాయి. ఇవి పాటిస్తే రక్తపోటు సమస్య పరిష్కారమౌతుంది.
అధిక రక్తపోటును ఎలా నియంత్రించడం
బ్లాక్ పెప్పర్
నల్ల మిరియాలనేవి ప్రతి కిచెన్‌లో తప్పకుండా ఉండేవే. స్వభావరీత్యా వేడి చేస్తుంది. జీర్ణక్రియను సరిచేసి..వాతం, కఫం సమస్యను దూరం చేస్తుంది. నల్ల మిరియాలు కొలెస్ట్రాల్, డయాబెటిస్, రక్తపోటుకు చాలా మంచిది. అధిక రక్తపోటు సమస్య ఉంటే రోజూ పరగడుపున వేడి నీళ్లలో ఒక నల్ల మిరియాలు కలిపి సేవిస్తే అధిక రక్తపోటు సమస్య నియంత్రణలో ఉంటుంది.
ఉసిరి
ఉసిరి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అధిక రక్తపోటు సమస్య నుంచి గట్టెక్కేందుకు ఉసిరి చాలా బాగా పనిచేస్తుంది. చలికాలంలో ఉసిరిని జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.
వెల్లుల్లి
వెల్లుల్లిలో వాతం, కఫం తగ్గించే పోషక గుణాలుంటాయి. శరీరాన్ని శుభ్రం చేసేందుకు ఉపయోగపడతాయి. అందుకే రోజూ పరగడుపున వెల్లుల్లి రెమ్మల్ని నమిలి తింటే..అధిక రక్తపోటును నియంత్రించవచ్చు.
బ్లాక్ కిస్మిస్
బ్లాక్ కిస్మిస్ అనేది అధిక రక్తపోటు రోగులకు ఓ వరం లాంటిది. బీపీ రోగులు పరగడుపున నానబెట్టిన కిస్మిస్లు తింటే మంచి లాభం కలుగుతుంది.
Also read: Kidney stones: మీ శరీరంలో ఈ లక్షణాలు కన్పిస్తే..నిర్లక్ష్యం చేయవద్దు, ప్రమాదకరమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook