Railway Facts: ప్రపంచం చంద్రుడిని చేరుతోంది. అయితే ఇప్పటికీ కొన్ని దేశాల్లో రైల్వే వ్యవస్థ లేదు. అందులో ఇండియా పొరుగుదేశం కూడా ఉండటం గమనార్హం. ఇండియాలో మాత్రం రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్దది. కువైట్ లాంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా అదే పరిస్థితి. ఆ వివరాలు మీ కోసం..
ఈస్ట్ తిమోర్‌లో సైతం రైల్వే వ్యవస్థ ఏర్పాటు కాలేదు. విస్తీర్ణంలో ప్రపంచంలోని చిన్న దేశాల్లో ఒకటి. అయితే త్వరలో ఈ దేశంలో 310 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది.
కువైట్ చిన్నదేశమైనా..ప్రపంచంలో అత్యంత ధనికదేశం. ఆయిల్ కర్మాగారాలకు నిలయం. అయినా ఇక్కడ కూడా రైల్వే లైన్ లేదు. ఈ దేశంలో ఉండే ప్రజలు, వారి జీవనశైలి చాలా హైఫైగా ఉంటుంది. కువైట్‌లో రైల్వే ప్రాజెక్టు ఇప్పుడు నిర్మాణంలో ఉంది. త్వరలో పూర్తి కానుంది.
సైప్రస్‌లో కూడా రైల్వే వ్యవస్థ లేదు. 1950 నుంచి 1951 వరకూ దేశంలో రైల్వే నెట్ వర్క్ ఉండేది. కానీ ఆర్ధిక పరిస్థితులు దిగజారిపోవడంతో ట్రాక్ ఉపయోగించలేదు. 1951 తరువాత రైల్వే వ్యవస్థ నిలిచిపోయింది.
దక్షిణ ఆసియాలో అతి చిన్న దేశం భూటాన్. ఇప్పటివరకూ ఈ దేశంలో రైల్వే వ్యవస్థ లేకపోవడం విశేషం. ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన ఇండియాలో కలిసిపోయినట్టుండే ఈ దేశంలో రైల్వే లైన్ లేకపోవడం గమనార్హం. అందుకే భూటాన్‌ను రైల్వే లైన్‌తో కలిపే ప్రతిపాదన ఇండియా నుంచి సిద్ధమౌతోంది.
ప్రపంచంలోని అతిచిన్న దేశాల్లో మరొకటి అండోరా. తక్కువ జనసంఖ్య ఉన్న ఈ దేశం విస్తీర్ణంలో కూడా చిన్నదే. ఈ దేశంలో ఇప్పటివరకూ రైల్వే లైన్ లేదు. ప్రైవేట్ లేదా పబ్లిక్ వాహనాల్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.