Diabetes Patient: చలి కాలంలో మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా ఇవి చేయాల్సిందే..

Diabetes Patient Diet Chart: మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా చలి కాలంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కింద పేర్కొన్న చిట్కాలను కూడా పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

  • Dec 14, 2022, 15:02 PM IST

Diabetes Patient Diet Chart: ప్రస్తుతం మన దేశంలో మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఇలాంటి క్రమంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు సీతాకాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1 /5

రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడానికి తప్పకుండా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ప్రతి రోజూ అధికంగా నీటిని తాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.   (NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)  

2 /5

  శీతకాలంలో మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వీరు ఆహారంలో శరీరానికి పోషకాలు అందించే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాల్సి ఉంటుంది.  

3 /5

షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నవారు తప్పకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా శరీర బరువును కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది.

4 /5

మధుమేహంతో బాధపడుతున్నవారు ఆల్కహాల్ తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. లేకపోతే రోగనిరోధక శక్తిని బలహీనంగా మారే అవకాశాలున్నాయి. దీంతో రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా పెరిగే ఛాన్స్‌ ఉంది.  

5 /5

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రతి రోజూ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. వీరు ప్రతి రోజూ వ్యాయామాలు, యోగా చేయండం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.