China Army PLA: ఇండియన్ ఆర్మీపైనే నేరం మోపిన చైనా ఆర్మీ

Chinese Army Statement: తవాంగ్ సెక్టార్‌లో ఇండియా, చైనా సరిహద్దుల్లో జరిగిన హింసాత్మక ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంటులో ప్రతిపక్షలు అడిగిన ప్రశ్నలు, లేవనెత్తిన సందేహాలకు రాజ్ నాథ్ సింగ్ సమాధానం ఇచ్చారు.

Written by - Pavan | Last Updated : Dec 13, 2022, 08:36 PM IST
  • ఇండియా, చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ
  • ఇండియా, చైనా మధ్య వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు
  • ఘర్షణపై స్పందిస్తూ భారత సైనికులపైనే బురద జల్లే ప్రయత్నం చేసిన చైనా సైనికులు
China Army PLA: ఇండియన్ ఆర్మీపైనే నేరం మోపిన చైనా ఆర్మీ

Chinese Army Statement: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో ఈ నెల 9న భారత సైనికులతో జరిగిన ఘర్షణపై చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ స్పందించింది. వాస్తవాధీన రేఖ వద్ద నీచమైన కుట్రకు పాల్పడిన చైనా సైన్యం ఆ విషయాన్ని దాచిపెట్టి తాజాగా తప్పుడు ఆరోపణలకు దిగింది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఎఎఫ్ పి వెల్లడించిన వివరాల ప్రకారం, వివాదాస్పద సరిహద్దులో భారత సైనికులు అక్రమంగా చైనా భూభాగంలోకి ప్రవేశించారని చైనా సైన్యం ఆరోపించింది.

భారత్ సైనికులపైనే చైనా సైన్యం ఆరోపణలు.. 
భారత్ , చైనా సరిహద్దుల్లో ఘర్షణ తరువాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో ఈ ఘటనపై చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ.. భారత్‌, చైనా సరిహద్దుల్లో పరిస్థితి సాధారణంగానే ఉందని అన్నారు. దౌత్య, సైనికపరైమన మార్గాల ద్వారా సరిహద్దు సమస్యలపై ఇరుపక్షాలు పరస్పర సంప్రదింపులు జరుపుతున్నట్టు వాంగ్ వెన్బిన్ చెప్పారు.

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన తరువాత మంగళవారం చైనా సైన్యం మాట్లాడుతూ.. భారత సైనికులు హిమాలయాలలో రెండు దేశాల మధ్య ఉన్న వివాదాస్పద సరిహద్దును దాటి చైనా దళాలతో ఘర్షణకు దిగారని పేర్కొంది. అయితే, అంతకంటే ముందు సోమవారమే ఈ ఘటనపై భారత సైన్యం ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. చైనా సైనికులే సరిహద్దులు దాటి వచ్చి తమతో ఘర్షణకు దిగినట్టు ఇండియన్ ఆర్మీ వెల్లడించగా.. భారత సైనికుల ప్రకటనకు విరుద్ధ ప్రకటన చేస్తూ చైనా సైనికులు ప్రత్యారోపణలకు దిగడం గమనార్హం. జూన్ 2020లో గాల్వన్ లోయలో భీకర ఘర్షణ జరిగిన తర్వాత ఇరు దేశాల సైనికుల మధ్య మళ్లీ పెద్ద ఘర్షణ చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 

పార్లమెంట్‌లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ఏం చెప్పారంటే..
తవాంగ్ సెక్టార్‌లో ఇండియా, చైనా సరిహద్దుల్లో జరిగిన హింసాత్మక ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంటులో ప్రతిపక్షలు అడిగిన ప్రశ్నలు, లేవనెత్తిన సందేహాలకు రాజ్‌నాథ్ సింగ్ సమాధానం ఇచ్చారు. చైనా సైనికులు మన భూభాగాన్ని ఆక్రమించకుండా భారత సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని ధైర్యంగా అడ్డుకుందని అన్నారు. ఈ ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులకు స్వల్ప గాయాలయ్యాయని.. అదృష్టవశాత్తుగా భారత సైనికుల ప్రాణాలకు ఎలాంటి హాని జరగలేదని క్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : India-China Border Clash: ఇండియా, చైనా సైనికుల మధ్య ఘర్షణ.. ప్రతిపక్షాలకు రాజ్‌నాథ్ సింగ్ సమాధానం

ఇది కూడా చదవండి : india vs china soldiers: భారత్, చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ.. పలువురికి గాయాలు

ఇది కూడా చదవండి : India-US Ties: సూపర్ పవర్‌గా భారత్.. మరో అగ్రరాజ్యంగా మారుతుంది: అమెరికా వైట్‌హౌస్ అధికారి జోస్యం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News