Urfi Javed Videos సినీ ప్రపంచంలో నటీమణుల వింత పాట్ల గురించి చెప్పాల్సిన పని లేదు. హీరోయిన్లు కూడా అవకాశాల కోసం అందాల ప్రదర్శన చేయాల్సి వస్తుంది. కొందరు మాత్రం ఇలా ఎక్స్‌పోజింగ్‌కు నో చెబుతుంటారు. కానీ ఎప్పుడోసారి మాత్రం ఈ అందాల ప్రదర్శన రూట్లోకి వస్తుంటారు. సాయి పల్లవి లాంటి కొందరే తమ తమ కట్టుబాట్లు, హద్దుల్లో ఉంటూ ఉంటారు. ఎన్ని కోట్లు ఇచ్చినా తమకు నచ్చని పని, కంఫర్ట్‌గా అనిపించని పనిని చేయరు. కానీ కొందరు మాత్రం సోషల్ మీడియాలో అందాలను విచ్చలవిడిగా ప్రదర్శిస్తుంటారు.
అలాంటి వారిలో ఉర్ఫీ జావెద్ ఒకరు. హిందీ సీరియల్స్‌లో నటించింది. ఈవెంట్లు, షోలు కూడా చేసింది. కానీ ఆమెకు ఎక్కువగా గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ ఓటీటీ షోతో ఆమెకు క్రేజ్ వచ్చింది. కరోనా సమయంలో ఈ బిగ్ బాస్ ఓటీటీ షో వచ్చింది. అందులో ఉర్ఫీ బాగానే ఫేమస్ అయింది. అక్కడ వచ్చిన ఇమేజ్ను ఉర్ఫీ కాపాడుకుంటూ వస్తోంది. అది ఎలానో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె ధరించే వింత వింత దుస్తులు చూసి జనాలు నోరెళ్లబెట్టేస్తుంటారు.
ఉర్ఫీ వేసుకునే బట్టలను బట్టలని కూడా అంటారా? అని జనాలు తిట్టిపోస్తుంటారు. కానీ ఉర్పీ మాత్రం ఇవన్నీ పట్టించుకోదు. తాను చేయాలనుకున్నదే చేస్తుంది. నగ్న ప్రదర్శనకు తక్కువ.. అర్దనగ్న ప్రదర్శనకు ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది ఉర్ఫీ చేష్టలు. తాజాగా ఆమె ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె పైన ఏమీ ధరించినట్టుగా కూడా కనిపించడం లేదు. కానీ వెనక నుంచి ఆ వీడియోను తీసింది.
దీంతో అది అర్దనగ్న ప్రదర్శనలానే కనిపిస్తోంది. ఇక ఆమె ధరించిన ప్యాంట్, వాటి మీదున్న చేతుల మార్క్ మీనింగ్ ఏంటో ప్రత్యేకంగా విడమరిచి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఆమె షేర్ చేసిన ఈ వీడియో మీద జనాలు చీ కొట్టేస్తున్నారు. ఇంత చీప్‌గా ప్రవర్తించాలా? ఇలాంటివి చేసే క్రేజ్ సంపాదించుకోవాలా? అని ఫైర్ అవుతున్నారు.
Also Read : Samantha South Korea Treatment : సమంత పరిస్థితి విషమం.. చికిత్స కోసం దక్షిణి కొరియాకు?
Also Read : Vijay Devarakonda Liger : విజయ్ దేవరకొండను ప్రశ్నించిన ఈడీ.. వాటిపై కూపీ లాగే ప్రయత్నం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook