Aftab Girlfriend Statement: ఢిల్లీలో జరిగిన శ్రద్ధా హత్య కేసుకు సంబంధించి రోజుకో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాలీగ్రాఫ్ పరీక్ష తర్వాత నిందితుడు అఫ్తాబ్ శ్రద్ధాను హత్య చేసి, ముక్కలుగా నరికి అడవిలో పడవేసినట్లు అంగీకరించాడు. తాజాగా ఈ కేసులో శ్రద్ధ హత్య తర్వాత అఫ్తాబ్ తన ఫ్లాట్‌కి తీసుకొచ్చిన అమ్మాయి వాంగ్మూలం తెరపైకి వచ్చింది. అఫ్తాబ్ శ్రద్ధా ముక్కలను ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు ఈ అమ్మాయి ఫ్లాట్‌కి వచ్చింది. ఈ ఫ్లాట్‌లో ఎవరినైనా చంపిన తర్వాత మృతదేహం ముక్కలను భద్రపరిచినట్లు తనకు పూర్తిగా తెలియదని ఆమె విచారణలో తెలిపింది.
అఫ్తాబ్‌కు డేటింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా వృత్తి రీత్యా మహిళా సైకియాట్రిస్ట్‌తో పరిచయం ఏర్పడింది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అఫ్తాబ్ ఎప్పుడూ భయపడినట్లు కనిపించలేదని.. అతని ముంబై ఇంటి గురించి తరచుగా మాట్లాడుతున్నాడని ఆమె వెల్లడించింది.
అక్టోబర్‌లో ఛతర్‌పూర్‌లోని ఫ్లాట్‌కు తాను రెండుసార్లు వెళ్లానని.. శ్రద్ధా వాకర్ శరీర భాగాలు ఫ్రీజర్‌లో ఉన్నాయని తనకు తెలియదని ఆమె విచారణలో తెలిపింది.
అఫ్తాబ్ ప్రవర్తన సాధారణంగా అనిపించిందని.. అతని మానసిక స్థితిపై ఎప్పుడు అనుమానం రాలేదని చెప్పింది. అఫ్తాబ్‌కు వివిధ రకాల డియోడరెంట్‌లు, పెర్ఫ్యూమ్‌ల సేకరించే అలవాటు ఉందని.. అతను తరచూ తనకు పెర్ఫ్యూమ్‌లను బహుమతిగా ఇచ్చేవాడని వెల్లడించింది. కాగా ప్రస్తుతం ఈ అమ్మాయి మానసికంగా చాలా కలత చెందింది. శ్రద్దాను అఫ్తాబ్ 35 ముక్కలుగా నరికాడని తెలియగానే.. ఆమె చాలా షాక్‌కు గురైంది. అప్పటి నుంచి ఆమె కౌన్సెలింగ్ జరుగుతోంది.
అఫ్తాబ్ ఎక్కువగా ధూమపానం చేసేవాడని.. త్వరలో ధూమపానం మానేస్తానని చెబుతుండేవాడని తెలిపింది. డిఫరెంట్ వెరటీస్ ఫుడ్‌ను చాలా ఇష్టపడేవాడని..తరచుగా ఇంట్లో వివిధ రెస్టారెంట్లలో నాన్-వెజ్ ఫుడ్‌ను ఆర్డర్ చేసేవాడని చెప్పింది. అఫ్తాబ్ ఫ్యాన్సీ తనకు ఉంగరాన్ని కూడా బహుమతిగా ఇచ్చాడని ఆ మహిళ చెప్పగా.. ఈ ఉంగరం శ్రద్ధాకు చెందినదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఉన్నత స్థాయి పోలీసు అధికారులు ఉన్నారు. సిట్ ఏర్పాటు తర్వాత పోలీసులు మరోసారి ఛతర్‌పూర్, గురుగ్రామ్ అడవుల్లో సోదాలు చేపట్టారు. నిందితుడు అఫ్తాబ్ పూనావాలా పాలిగ్రాఫ్ పరీక్ష తర్వాత ఈ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. శ్రద్ధా మృతదేహం ముక్కల కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు.
Also Read: YS Sharmila: ఎమ్మెల్సీ కవిత వర్సెస్ వైఎస్ షర్మిల.. ట్విట్టర్‌లో మాటల యుద్ధం
Also Read: Pak Vs Eng: పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ జట్టులో కలకలం.. 14 మంది ఆటగాళ్లకు అస్వస్థత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి