Allu Arjun Trolled: డబ్బు సంపాదించేది ఇక్కడ, కానీ అంత అలుసా.. ఎరక్కపోయి ఇరుకున్న అల్లు అర్జున్!

Allu Arjun Getting Trolled: తన కుమార్తెతో కలిసి ఒక సరదా వీడియో రిలీజ్ చేసిన అల్లు అర్జున్ అనూహ్యంగా ట్రోలర్స్ కు టార్గెట్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 22, 2022, 06:01 PM IST
  • డబ్బు సంపాదించేది ఇక్కడ, కానీ అంత అలుసా..
  • ఎరక్కపోయి ఇరుకున్న అల్లు అర్జున్
  • దారుణంగా ట్రోల్ చేస్తున్న తెలంగాణ నెటిజన్లు
Allu Arjun Trolled: డబ్బు సంపాదించేది ఇక్కడ, కానీ అంత అలుసా..  ఎరక్కపోయి ఇరుకున్న అల్లు అర్జున్!

Allu Arjun Getting Trolled For Using Telangana Word: ఒక్కోసారి అనుకోకుండా చేసిన పొరపాటులే కొంపముంచుతూ ఉంటాయి. అవి తప్పు అని కూడా తెలియకుండానే ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇప్పుడు అదే పరిస్థితి అల్లు అర్జున్ కి కూడా ఎదురైంది. ఆయన తెలిసి అన్నాడో లేక సరదాకి అన్నాడో కానీ ఇప్పుడు ఒక వర్గం ఫాన్స్ కు టార్గెట్ అయ్యాడు.  అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు అన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో తన కుమారుడు, తన కుమార్తె చేస్తున్న అల్లరి పనులు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆయన ఆనంద పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

తాజాగా తన కుమార్తె అల్లు అర్హ పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న క్యూట్ వీడియోని అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఆ వీడియోలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఇంట్లో కందిరీగలు పెట్టిన ఒక పుట్ట గురించి ప్రస్తావిస్తోంది, ఆ కందిరీగలు పెట్టిన పొట్ట గురించి కూడా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఉండగా ఏదో ప్రశ్నిస్తే ఆమె తెలంగాణ యాసలో సమాధానం పుట్ట గురించి సమాధానం చెబితే అల్లు అర్జున్ తెలంగాణ యాస అన్నట్లుగా కామెంట్ చేయడంతో ఇదే విషయం మీద తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ భాష వద్దా? అల్లు అర్జున్ గారు తెలంగాణలో ఇల్లు, బిజినెస్ స్టూడియో, ప్రాపర్టీస్, పెళ్లాం, పిల్లలు అన్ని తెలంగాణలో పుట్టినవే కదా అండి అని ఒకరు ప్రశ్నిస్తే ఆవిడ తెలంగాణలో మాట్లాడితే తప్పేంటి తెలంగాణలో మాట్లాడడం తప్పు కాదు మీ ఆలోచన విధానం తప్పు అని ఒకరు కామెంట్ చేయగా మరొకరు తెలంగాణలో ఉంటూ తెలంగాణలో మాట్లాడితే తప్పేంటి అని ప్రశ్నించారు. ఇక మరొకరు నల్గొండ బిడ్డ కూతురు అన్న తెలంగాణనే వస్తది, హ్యాపీ బర్త్డే అంటూ మరొకరు కామెంట్ చేశారు.

అయ్య బాబోయ్ తీసిన అర్హ అలా అన్నప్పుడు ఎందుకు మీరు తెలంగాణ అనే పదం వాడారు అని ఒకరు కామెంట్ చేస్తే తెలంగాణలో ఉంటూ తెలంగాణలో లాంగ్వేజ్ మాట్లాడవద్దు అంటున్నావు వెళ్లిపోండి మరి ఏపీకే అని మరొకరు కామెంట్ చేశారు. అలాగే మరొకరు ఆమె తెలంగాణలో మాట్లాడుతుందా ఆంధ్రలో మాట్లాడుతున్నదా అని కాదు, పూర్తిగా తెలుగు మాట్లాడనివ్వండి అని కామెంట్ చేస్తే తెలంగాణ లాంగ్వేజ్ వాడితే తప్పేముంది బ్రదర్ కరెక్ట్ చేస్తున్నారు.

అంటే తెలంగాణలో ఉంటూ తెలంగాణ లాంగ్వేజ్ ని ఇన్సల్ట్ చేసినట్లే అని మరొకరు కామెంట్ చేశారు. బహుశా బన్నీకి ఈ విషయం తెలుసో లేదో కానీ ప్రాంతీయ వాదం కూడా చెలరేగే అవకాశం కనిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే బన్నీ తాత అల్లు రామలింగయ్య ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత భీమవరం జిల్లా పాలకొల్లు ప్రాంతానికి చెందిన వారు కాగా ముందుగా మద్రాసు ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి సినిమా పరిశ్రమలో సెటిల్ అయ్యారు ఇక.

అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి నల్గొండ ప్రాంతానికి చెందినవారు కాగా ఆమెను అల్లు అర్జున్ ప్రేమించి వివాహం చేసుకున్నారు. అల్లు అర్జున్ మామ అంటే స్నేహ రెడ్డి తండ్రి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఒక ప్రముఖ లీడర్. ఈసారి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ వ్యవహారం మీద బన్నీ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Also Read: Sujith: తంతే బూరెల బుట్టలో పడిన సుజిత్.. ఆ దర్శకుడి దెబ్బకు పవన్ నుంచి ఆహ్వానం!

Also Read: Hit 3: హిట్ 3 కోసం దిమ్మతిరిగే కాంబినేషన్ సెట్.. అడివి శేష్ తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News