భారత ప్రధానిపై చైనా ప్రశంసలు, సంబంధాల బలోపేతం విషయంలో మోడీ చొరవ భేష్

                                                                   

Last Updated : Jun 5, 2018, 01:35 PM IST
భారత ప్రధానిపై చైనా ప్రశంసలు, సంబంధాల బలోపేతం విషయంలో మోడీ చొరవ భేష్

పీఎం నరేంద్ర మోడీ ప్రధాన బలం అనర్గళంగా మాట్లాడటం. అద్భుత ప్రసంగం ఇవ్వడం..అవతలివాళ్లను నేర్పుగా మెప్పించల సమర్ధుడు ఆయన. ఈ లక్షణాలతోనే ఆయన ప్రపంచదేశాలను మెప్పిస్తున్నారు. మంచి కమ్యూనికేటర్ గా గుర్తింపు ఉన్న మోడీ ..తన ప్రసంగంతో మిత్ర దేశాలనే కాదు శత్రుదేశాల వారిని కూడా ప్రశంసించేలా చేస్తున్నారు. తాజాగా మోడీ వాక్ చాతుర్యానికి ముద్ధులై శత్రుదేశం చైనా కూడా ఆయనపై ప్రశంసల జల్లు కురిపిప్తోంది. వివరాల్లోకి వెళ్లినట్లయితే..

సింగపూర్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ  'ఏషియాస్ ప్రీమియర్ డిఫెన్స్ అండ్ స్ట్రాటెజిక్ అఫైర్స్' కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ  సరిహద్దు సమస్యతో పాటు మరెన్నో విషయాల్లో భారత్-చైనా దేశాలు ఎంతో  సమన్వయంతో వ్యవహరిస్తున్నాయని చెప్పారు. ఇరు దేశాలు ఒకరిపైమరొకరు నమ్మకంతో కలసి పని చేస్తే ఆసియాకే కాకుండా యావత్ ప్రపంచానికే మెరుగైన భవిష్యత్తు ఉంటుందన్నారు. 

మోడీ ప్రసంగం తర్వాత వేదికపై వచ్చిన  చైనా విదేశాంగ ప్రతినిధి హువా చున్యింగ్ ప్రధాని మోడీపై ప్రశంసలు కురింపించారు. మోడీ ప్రసంగం ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం దిశగా ఉందని.  ఇలాంటి స్పందనను  తాము ప్రశంసిస్తున్నామని తెలిపారు. 
 

ఇటీవలే భారత్ ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ల మధ్య జరిగిన భేటీని గుర్తు చేస్తూ ఇరు దేశాధినేతలు అంతర్జాతీయ అంశాలతో పాటు ద్వైపాక్షిక సంబంధాల గురించి ఇరువురు నేతలు నిర్మాణాత్మకమైన చర్చలు జరిపారని.. ఇలాంటి చర్చలు దేశాల మధ్య సంబంధాలు మెరుగపడటానికి ఉపయోగపడతాయన్నారు. భారత్ చైనా సంబంధాలు బలోపేతం చేసేందుకు భారత ప్రధాని మోడీ తీసుకుంటున్న చొరవ అభినందనీయమన్నారు. కాగా ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పరిణతితో తొలగించుకోవాలని నిర్ణయించారని ఈ సందర్భంగా చైనా విదేశాంగ ప్రతినిధి హువా చున్యింగ్ వెల్లడించారు.

Trending News