చలికాలం వచ్చిందంటే చాలు ఆరోగ్యం ప్రమాద ఘంటికలు మోగిస్తుంటుంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఈ నేపధ్యంలో ఆస్తమా రోగులు చాలా విషయాల్లో కేర్ తీసుకోవాలి. కొన్నిరకాల పదార్ధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు.
ప్రస్తుత సీజన్‌లో చలి కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురౌతుంటాయి. ముఖ్యంగా ఆస్తమా రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆస్తమా రోగులకు చలికాలంలో శ్వాసవాహికలో వాపు వస్తుంది. ఫలితంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. మరోవైపు జలుబు, దగ్గు, ఫ్లూ ముప్పు పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఆస్తమా రోగులు తమ ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కొన్న పదార్ధాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఆస్తమా రోగులు ఏయే పదార్దాలు తీసుకోకూడదో తెలుసుకుందాం..
ఆస్తమా రోగులు ఈ పదార్ధాలకు దూరంగా ఉండాలి
చల్లని, పుల్లని పదార్ధాలు
ఆస్తమా రోగులు ఎప్పుడూ చల్లటి, పుల్లటి పదార్ధాలు తీసుకోకూడదు. ముఖ్యంగా ఐస్‌క్రీమ్, చల్లని నీళ్లు, నిమ్మకాయ, పికిల్స్, పెరుగు వంటి పదార్ధాలకు దూరంగా ఉండాలి. ఇవి తీసుకోవడం వల్ల ఆస్తమా ట్రిగ్గర్ కావచ్చు. మరోవైపు దగ్గు సమస్య పెరుగుతుంది. అందుకే ఈ పదార్ధాల్ని ఆస్తమా రోగులు సేవించకూడదు.
టీ-కాఫీ
చలికాలంలో చాలామంది టీ, కాఫీ ఎక్కువగా తాగుతుంటారు. చలికాలంలో ఒక కప్పు టీ లేదా కాపీ తాగడం వల్ల వేడిమి లభిస్తుంది. కానీ ఆస్తమా రోగులకు టీ లేదా కాఫీ తాగడం మంచిది కాదు. ఎందుకంటే టీ , కాఫీలతో ఆస్తమా రోగులకు సమస్య మరింత పెరుగుతుంది. టీ, కాఫీ తాగితే..గ్యాస్ సమస్య పెరుగుతుంది. దీంతో ఆస్తమా ముప్పు పెరగవచ్చు.
ప్రిజర్వేటివ్
ఆస్తమా రోగులు ప్రిజర్వేటివ్స్ ఉండే పదార్ధాలు తీసుకోకూడదు. ముఖ్యంగా పికిల్స్, ప్యాక్డ్ ఫుడ్స్ వల్ల ఆస్తమా రోగుల సమస్యలు మరింతగా పెరుగుతాయి.
Also read: Jamun Seeds Benefits: డయాబెటిస్‌కు చికిత్స నేరేడు విత్తనాలే, ఇతర లాభాలివీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook