Shani dev: ఈ 5 రాశులవారిపై శని మహాదశ.. నివారణకు ఇలా చేయండి..

Shani Sade sati: శని ధైయా లేదా సడే సతితో బాధపడేవారు ఈ నెల మొదటి శనివారం నాడు కొన్ని పరిహారాలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2022, 01:09 PM IST
Shani dev: ఈ 5 రాశులవారిపై శని మహాదశ.. నివారణకు ఇలా చేయండి..

Shani Sade sati Remedies: ఆస్ట్రాలజీ ప్రకారం, మనం చేసే మంచి చెడులను బట్టి ఫలాలను ఇచ్చేవాడు శనిదేవుడు. అందుకే శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అంటారు. శనిదేవుడు (Shani Dev) కోపానికి గురైతే బిలియనీర్ కూడా బిచ్చగాడిగా మారతాడు. శని అనుగ్రహం ఉంటే దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు. జ్యోతిష్యశాస్త్రంలో శనిదేవుడిని సంతోష పెట్టడానికి ఎన్నో చిట్కాలు చెప్పబడ్డాయి. 

ఈ రాశులపై శని మహాదశ
ప్రస్తుతం 5 రాశులవారిపై శనిసడేసతి మరియు ధైయా కొనసాగుతుంది. దీంతో వీరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ప్రస్తుతం ధనుస్సు, మకరం మరియు కుంభం శనిసడే సతి కొనసాగుతోంది. ఈ సమయంలో ఈ మూడు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. అదేవిధంగా మిథునం, తులరాశివారిపై శని  ధైయా కొనసాగుతోంది. 

ఆ రోజు చాలా మంచిది..
హిందూ క్యాలెండర్ ప్రకారం, మార్గశీర్ష మాసం ప్రారంభమైంది, హిందూ సంవత్సరంలో తొమ్మిదవ నెలను అఘన్ లేదా ఆగ్రహాయణం అని కూడా అంటారు. వివాహం వంటి శుభ కార్యాలకు మార్గశీర్ష మాసం చాలా శ్రేయస్కరం. ఈ నెలలో మొదటి శనివారం నవంబర్ 12వ తేదీన వస్తుంది. చంద్రుడు.. మిథునం, మృగశీర మరియు అద్ర నక్షత్రంలో సంచరిస్తాడు. సిద్ధయోగం కూడా ఏర్పడుతోంది. కాబట్టి శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజు చాలా మంచిది. 

శని దేవుడి పరిహారాలు
ప్రతి శనివారం చీమలకు పిండి, పంచదార కలిపి తినిపిస్తే శనిదేవుడి సంతోషిస్తాడు. అదే విధంగా శనివారం సూర్యాస్తమయం తర్వాత నల్లని గుర్రపుడెక్క ఉంగరం లేదా బోట్ నెయిల్ రింగ్‌ని మధ్య వేలుకు ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. అంతే కాకుండా ప్రతి శనివారం పీపుల్ చెట్టు దగ్గర ఆవాలనూనె దీపం వెలిగించి, వీలైతే ఈ రోజున ఆవాలనూనె మరియు కొంత డబ్బును దానం చేయడం మంచిది. 

Also Read: Surya Gochar 2022: వృశ్చికరాశిలో సూర్య సంచారం... ఇక ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News