Lunar Eclipse 2022: ఇవాళ అంటే నవంబరు 8న సంవత్సరంలో రెండవ మరియు చివరి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం సాయంత్రం చంద్రోదయంతో ప్రారంభమవుతుంది. ఇది దేశంలోని తూర్పు ప్రాంతంలో మొదట కనిపిస్తుంది. ఈసారి చంద్రగ్రహణం (Chandra Grahan 2022) మేషరాశిలో ఏర్పడుతుంది. ఈ గ్రహణ ప్రభావం 12 రాశులలో కొందరికి శుభప్రదంగానూ, కొందరికి అశుభకరంగానూ ఉంటుంది. ఈ గ్రహణం వల్ల ఏరాశివారికి లాభం, ఏరాశివారికి నష్టం తెలుసుకుందాం.
మేషం (Aries): ఈ రాశివారు స్వభావం దూకుడుగా ఉంటుంది. మీ పనిలో సమస్యలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారానికి అనుకూలమైన సమయం. ప్రశాంతంగా పని చేయండి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.
వృషభం (Taurus): విదేశాలతో అనుబంధం ఉన్నవారు విపరీతమైన ప్రయోజనాలను పొందుతారు. ఆధ్యాత్మికత పట్ల ఇష్టం పెరుగుతుంది. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు.
మిథునం (Gemini): ధన లాభం ఉంటుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఉన్నత స్థానాల్లో కూర్చున్న వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి. ప్రేమ జీవితంలో సమస్యలు రావచ్చు.
కర్కాటకం (Cancer): జీతం పెరగవచ్చు. ప్రమోషన్ రావచ్చు. కుటుంబానికి తక్కువ సమయం ఇవ్వగలుగుతారు. మీ ఆరోగ్యం మరియు మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
సింహం (Leo): మీ ఔదార్యం ప్రజల హృదయాలను గెలుచుకుంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇతరులతో గొడవలకు స్వస్తి చెప్పండి.
కన్య (Virgo): ఈ సమయం మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఆలోచించి డబ్బు ఖర్చు చేయండి. అత్తమామల ఇంట్లో గొడవలు రావచ్చు.
తుల (Libra): ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పెట్టుబడి పెట్టవచ్చు. వ్యక్తిగత జీవితంపై శ్రద్ధ వహించండి. ఒత్తిడిని తగ్గంచుకోండి.
వృశ్చికం (Scorpio): మీ సీనియర్ సహోద్యోగులు మీకు సరైన మార్గాన్ని చూపుతారు. మీరు పనిలో విజయం సాధిస్తారు. కెరీర్ మార్పుకు ఇది మంచి సమయం. న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకునే అవకాశం ఉంది.
ధనుస్సు (Sagittarius) : సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీతం పెరగవచ్చు. ఉద్యోగార్థులు లాభపడతారు. ప్రేమ జీవితంలో ఒత్తిడిని నివారించడానికి, భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
మకరం (Capricorn): వృత్తికి అనుకూలమైన సమయం. మీరు కొన్ని శుభవార్తలను వింటారు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు పూర్తి కాగలవు. పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండండి. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
కుంభం (Aquarius): మీరు సవాలుతో కూడిన బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంది. పాత పెట్టుబడులు లాభిస్తాయి. ఫ్యామిలీ ట్రిప్‌కి వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
మీనం (Pisces): కొంత మెుత్తాన్ని పొదుపు చేసుకోండి, లేకుంటే ఇబ్బందుల్లో పడవచ్చు. కటువ మాట్లాడటం మానుకోండి. ఈ సమయంలో మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.
Also Read: Chandra Grahan 2022: నేడే చంద్రగ్రహణం.. ఈ రోజు ఏం తినాలి, ఏం తినకూడదో తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి