Vaishali Takkar Suicide Case : సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితురాలు, బుల్లితెర నటి వైశాలి ఠక్కర్ ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ తెర మీదకు వస్తోంది. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న రాహుల్ నవ్లానీ రోజుకో కొత్త విషయం చెబుతూ పోలీసులను గందరగోళానికి గురిచేస్తుండగా మరో వైపు దొరికిన ఐఫోన్ అన్ లాక్ కాకపోవడంతో పోలీసులకు టెన్షన్ పెరిగిపోతోంది. ఇంతవరకు రాహుల్‌ని విచారించినా పోలీసులకు ఎలాంటి ముఖ్యమైన ఆధారాలు లభించకపోవడం కూడా సమస్యగా మారింది. నిజానికి ఇండోర్ పోలీసులు రాహుల్ నవ్లానీని అక్టోబర్ 19న అరెస్టు చేశారు, ఆ తర్వాత అక్టోబరు 28 వరకు రిమాండ్‌కు తీసుకున్నారు. రాహుల్ నవ్లానీ విచారణలో, పోలీసులు ఎటువంటి ముఖ్యమైన ఆధారాలను సేకరించలేకపోయారు, ఇంతలో అతని రిమాండ్ కూడా ముగిసింది.
వైశాలి టక్కర్ అక్టోబర్ 15 రాత్రి ఆత్మహత్యకు పాల్పడగా ఆ సమయంలో సూసైడ్ నోట్లో తన ఇంటి పొరుగున ఉండే రాహుల్ కారణమని పేర్కొన్నారు. సూసైడ్ నోట్లో రాహుల్ తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని వైశాలి ఠక్కర్ ఆరోపించి, అతని వేధింపులకు సంబంధించిన అన్ని విషయాలను రాసుకొచ్చింది. ఈ నోట్ ఆధారంగా రాహుల్, అతని భార్య దిశపై ఆత్మహత్యకు ప్రేరేపించిన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రాహుల్ పోలీసులకు పట్టుబడ్డాడు కానీ అతని భార్య మాత్రం పరారీలో ఉంది. రాహుల్ నవ్లానీ విచారణలో పోలీసులకు ఏమీ చెప్పలేదని అంటున్నారు.
ఇక తాజా విచారణలో, వైశాలి ఠక్కర్‌కు టీవీలో అవకాశాలు రావడం లేదని, అందుకే ఆమె తనతో టచ్‌లో ఉందని రాహుల్ పోలీసులకు చెప్పడమే కాక వైశాలి ఆర్థికంగా బలహీనంగా మారిందని రాహుల్ పేర్కొన్నారు. ఆమె వద్ద డబ్బు లేకపోవడంతో వైశాలికి ఆర్థిక సాయం చేసే వాడినని వైశాలితో తనకు మంచి స్నేహం ఉందని కూడా రాహుల్ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. వైశాలికి తన తండ్రి సహాయం తీసుకోవడం ఇష్టం లేదని, అందుకే ఆమెకు తాను చాలాసార్లు డబ్బు సాయం చేశానని చెబుతున్నా రాహుల్ చెబుతున్న దానిపై పోలీసులకు నమ్మకం కలగడం లేదు. దీంతో పోలీసులు ఇప్పుడు రాహుల్, వైశాలి బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
రాహుల్ విచారణకు సహకరించడం లేదని అవసరమైతే, అతని నార్కో పరీక్ష చేయించడానికి కోర్టు నుండి అనుమతి కూడా తీసుకుంటామని చెబుతున్నారు. రాహుల్ నవ్లానీకి చెందిన మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నా, వైశాలి ఠక్కర్ ఆత్మహత్య తర్వాత రాహుల్ తన మొబైల్ డేటాను తొలగించడంతో రెండు మొబైల్స్ డేటాను రికవరీ చేశారు. ఇక మూడవ ఫోన్ ఐఫోన్ అని దాని లాక్ ఓపెన్ కాక పోవటంతో పోలీసుల్లో టెన్షన్ నెలకొంది. ఈ విషయమై పోలీసులు ఐఫోన్ కంపెనీకి సహాయం కోసం లేఖ కూడా రాశారు. అదే సమయంలో, పరారీలో ఉన్న రాహుల్ నవ్లానీ భార్య కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు.
ఇక తాజాగా వైశాలి స్నేహితుడు నిశాంత్ కొన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించారు . రాహుల్ వైశాలిని చాలా వేధిస్తున్నాడని, వైశాలికి కాబోయే భర్తకు కూడా మెసేజ్‌లు పంపుతూ వేధిస్తున్నాడని నిశాంత్ అన్నారు. వైశాలి పెళ్లి చేసుకుని వెళ్లేందుకు రాహుల్ అనుమతించడం లేదని, వైశాలి డిప్రెషన్లోకి వెళ్లి సైకియాట్రిస్ట్ ను కూడా సంప్రదించింది పేర్కొంది. అందుకే వైశాలి షూటింగ్ సెట్లో కూడా చాలా ఏడ్చేదని, సరిగ్గా నటించలేకపోయిందని నిశాంత్ మల్కాని చెప్పాడు.
Also Read: Samantha Myositis : అనారోగ్యంతో ఆస్పత్రిలో సమంత.. కదిలిన ఇండస్ట్రీ.. నాగబాబు అలా దర్శకేంద్రుడు ఇలా
Also Read: Aamir Khan Mother Heart Attack: స్టార్ హీరో తల్లికి గుండెపోటు.. ఆ రోజు నుంచి అక్కడే అమీర్ ఖాన్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook