ఏపీ ఎంసెట్ 2022 చివరి దశకై సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ టెక్నికల్ డిపార్ట్‌మెంట్, APSCHEలు విడుదల చేసిన ఈ ఫలితాల్ని అభ్యర్ధులు చెక్ చేసుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
AP EAMCET 2022 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు వివరాల్ని సంబంధిత అభ్యర్ధులు cets.apsche.ap.gov.inలో చెక్ చేసుకోవచ్చు. దీనికోసం అభ్యర్ధుల అప్లికేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టినతేదీ వివరాలు అవసరమౌతాయి. ఏపీఎంసెట్ అధికారిక వెబ్‌సైట్ eapcet-sche.aptonline.inలో కూడా చూడవచ్చు. అక్టోబర్ 26 నుంచి అక్టోబర్ 31 మధ్యలో సంబంధిత అభ్యర్ధులు తమ రిపోర్ట్స్ సమర్పించాల్సి ఉంటుంది.
AP EAMCET 2022 సీట్ల కేటాయింపు ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి
AP EAMCET 2022 అధికారిక వెబ్‌సైట్ eapcet-sche.aptonline.in ఓపెన్ చేయాలి. ఇందులో AP EAMCET 2022 సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్ లింక్ క్లిక్ చేయాలి. మీ లాగిన్ వివరాలు ఎంటర్ చేయాలి. స్క్రీన్‌పై మీ సీట్ కేటాయింపు వివరాలు ప్రత్యక్షమౌతాయి.
Also read: Pawan Kalyan: పవన్‌ను సీఎంగా ప్రకటిస్తే పొత్తుకు ఓకే! చంద్రబాబుకు బీజేపీ పెద్దల ఆఫర్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook