Virat Kohli: టీ20 ప్రపంచ్ కప్ లో భారత్ అదరగొట్టింది. తొలి మ్యాచ్ లోనే దాయాది పాకిస్తాన్ పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి బోణి కొట్టింది. చివరు బంతి వరకు సస్పెన్స్ గా సాగిన మ్యాచ్ లో రోహిత్ సేన నాలుగు వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ తో ఇండియాకు గెలుపు అందించాడు. దీంతో కింగ్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సోషల్ మీడియాలో విరాట్ కు క్రికెట్ ఫ్యాన్స్ నీరాజనాలు పలుకుతున్నారు. పాకిస్తాన్ పై రోహిత్ సేన విజయాన్ని యావత్ భారతవాణి సెలబ్రేట్ చేసుకుంది. దేశమంతా ఒక రోజే ముందే దీపావళి జరుపుకుంది.
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ను ఆస్వాదించారు. టీమిండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. భారత్ విజయంపై ట్వీట్ చేశారు పిచాయ్. " హ్యాపీ దీపావళి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి దీపావళి పండుగను గొప్పగా జరుపుకుంటున్నారని ఆశిస్తున్నాను. నిన్న జరిగిన టీమిండియా – పాకిస్తాన్ మ్యాచ్‌కు సంబంధించిన చివరి మూడు ఓవర్లను ఇవాళ మళ్లీ చూసి.. దీపావళి వేడుకలను జరుపుకుంటున్నాను. అద్భుతమైన ఆట. అద్భుతమైన ప్రదర్శన " అని సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. టీమిండియా, టీ20 వరల్డ్ కప్ 2022 హ్యాష్ ట్యాగ్‌లను తన ట్వీట్ కు ఆయన జత చేశారు.
Happy Diwali! Hope everyone celebrating has a great time with your friends and family.
🪔 I celebrated by watching the last three overs again today, what a game and performance #Diwali #TeamIndia #T20WC2022— Sundar Pichai (@sundarpichai) October 24, 2022
సుందర్ పిచాయ్ ట్వీట్ పై ఓ పాకిస్తాన్ నెటిజన్ ముమహ్మద్ షహజీబ్ స్పందించాడు. మొదటి మూడు ఓవర్లను కూడా చూడాలి అంటూ రీట్వీట్ చేశాడు. తొలి మూడు ఓవర్లలో పాకిస్తాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కేఎల్ . కేవలం 4 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ మూడు ఓవర్లను ఉద్దేశించే షహజీబ్ అలా ట్వీట్ చేశాడు. అయితే పాకిస్తానీ ఇచ్చిన కౌంటర్ కు మళ్లీ తనదైన శైలిలో స్పందించారు గూగుల్ సీఈవో. ఆ మూడు ఓవర్లు కూడా చూశాను.. భువీ, అర్ష్‌దీప్ నుంచి అద్భుతమైన బౌలింగ్ స్పెల్ అంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. పిచాయ్ కౌంటర్ కు మళ్లీ స్పందించాడు పాక్ నెటిజన్. తాను ఇండియా ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతున్నానని మరో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు భారీగా స్పందించారు. సుందర్ పిచాయ్ సమయస్ఫూర్తిని కొనియాడారు. సుందర్ పిచాయ్ లాంటి గొప్ప వ్యక్తి నిన్ను ట్రోల్ చేశాడు.. ఆయన రిప్లయ్ ఇచ్చిన ట్వీట్‌ను స్క్రీన్ షాట్ తీసి లామినేట్ చేయించి నీ లివింగ్ రూమ్‌లో ఉంచుకో.. అది కోట్లాది రూపాయలు విలువ చేసే పెయింటింగ్ లాంటిది అని కొందరు సూచించారు. దీనికి స్పందించిన ముమహ్మద్ షహజీబ్ సుందర్ తనకు ఇచ్చిన రిప్లయ్ ని లామినేషన్ చేయించుకుంటానని చెప్పారు.
Also Read : Munugode Bypoll: రాజగోపాల్ రెడ్డిపై దాడుల వెనుక ఎవరున్నారు? మునుగోడులో ఏం జరుగుతోంది?
Also Read : Munugode Elections: రాజగోపాల్ రెడ్డికి షాక్.. చెప్పుతో దాడికి యత్నం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి