Virat Kohli October Sentiment to continue in IND vs PAK Match at T20 World Cup 2022: రన్ మెషిన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలోకి దిగాడంటే.. పరుగుల వరద పారాల్సిందే, రికార్డుల మోత మోగాల్సిందే. ఫార్మాట్ ఏదేమైనా.. పిచ్ ఎలాంటిదైనా.. బౌలర్ ఎవరైనా.. కోహ్లీ బ్యాట్ నుంచి పరుగులు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. అయితే గత కొన్ని నెలలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. మళ్లీ ఫామ్ అందుకున్నాడు. దాంతో టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా నేడు పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో కోహ్లీ చెలరేగుతాడని ఫాన్స్ బలంగా నమ్ముతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. అక్టోబర్ 23 అంటే కోహ్లీకి పూనకమే.
అక్టోబర్‌లో మ్యాచ్‌లు అంటే విరాట్ కోహ్లీకి పూనకమే వస్తుంది. ముఖ్యంగా అక్టోబర్ 21-24 మధ్య తేదిల్లో జరిగిన మ్యాచ్‌ల్లో విధ్వంసం సృష్టించాడు. 2011 నుంచి 21 వరకు ఈ సెంటిమెంట్ కొనసాగింది. 2011 అక్టోబర్ 23న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 86 పరుగులు చేసిన కోహ్లీ.. 2015 అక్టోబర్ 22న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 138 రన్స్ బాదాడు. 2016 అక్టోబర్ 23న న్యూజిలాండ్‌పై 154 పరుగులు చేసిన రన్ మెషిన్.. 2017 అక్టోబర్ 21న వెస్టిండీస్‌పై 140 రన్స్ బాదాడు. 2017 అక్టోబర్ 22న న్యూజిలాండ్‌పై 121 పరుగులు, 2018 అక్టోబర్ 24న వెస్టిండీస్‌పై 157 పరుగులు చేశాడు.
2021 అక్టోబర్ 24న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 57 పరుగులు చేశాడు. గత ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినప్పటికీ.. కోహ్లీ ఒకడే రాణించాడు. నేడు అక్టోబర్ 23 కాబట్టి రికార్డుల రారాజు చెలరేగుతాడని గణాంకాలు ఓ వైపు చెపుతుంటే.. నేడు కోహ్లీ విశ్వరూపం పక్కా అని ఫాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ సెంటిమెంట్ నేటి మ్యాచ్‌లో రిపీట్ అయితే.. పాకిస్థాన్ బౌలర్లు పట్టపగలే చుక్కలు చూడడం పక్కా.
Virat Kohli matches he played between 21st to 24th October in his career. 23rd October 🔥.
23 Oct 2011: vsENG- 86*
22 Oct 2015: vsSA- 138
23 Oct 2016: vsNZ- 154*
22 Oct 2017: vsNZ- 121
21 Oct 2017: vsWI- 140
24 Oct 2018: vsWI- 157*
24 Oct 2021: vsPAK- 57 #INDvsPAK https://t.co/8HZ33TByDV— Himanshu Pareek (@Sports_Himanshu) October 19, 2022
పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ ద్వారా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డుపై విరాట్ కోహ్లీ కన్నేశాడు. ఐసీసీ టోర్నీల్లో సచిన్ ఇప్పటివరకు 23 అర్థ సెంచరీలు బాదారు. కోహ్లీ కూడా ఐసీసీ టోర్నీల్లో 23 హాఫ్ సెంచరీలతో సచిన్‌తో కలిసి సమానంగా ఉన్నాడు. పాక్‌తో జరిగే మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేస్తే.. సచిన్‌ను విరాట్ అధిగమిస్తాడు. దాంతో ఐసీసీ టోర్నీల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన తొలి భారత ఆటగాడిగా కోహ్లీ నిలవనున్నాడు.
Also Read: IND vs PAK Dream11 Team: భారత్ vs పాకిస్థాన్ పోరు.. డ్రీమ్ ఎలెవన్ టీమ్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook