Giant Python Viral Video: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైనవి ఉంటే.. మరికొన్ని సోషల్ మీడియా వినియోగదారులను భయపెడుతున్నాయి. భయపెట్టే వాటిలో ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలే. పాములంటే సాధారణంగా అందరూ భయపడుతూ ఉంటారు. పాములు మానవులకు ఎంతో హాని కలిగించే సర్పాలు. అయితే సర్పాల్లో చాలా రకాల జాతలు మీద జీవిస్తూ ఉన్నాయి. ఇందులో కొన్ని జాతులు మాత్రమే మానవులకు హాని కలిగిస్తాయి. మిగతా కొన్ని మనుషులకు ఎలాంటి హాని కలిగించవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే పాములకు సంబంధించిన వైరల్ వీడియోలో ఎక్కువగా కొండచిలువలు, నాగుపాములు ఉండడం విశేషం. భూమిపై మూడు వేల జాతులకు పైగా పాములు ఉన్నాయి. వీటిలో కేవలం ఒక అంగుళం నుంచి పది అంగుళాల వరకు ఉండేవి సహజంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే 1912లో అతి పొడవైన 32.8 అడుగుల పామును అమెరికా దేశస్థులు కనుగొన్నారు.
ఈ పామును కొండచిలువగా గుర్తించారు. ఇది దాదాపు 158.8 కిలో గ్రాముల బరువు ఉందని.. ఇది మానవులకు చాలా హాని కలిగించేదని వారి పేర్కొన్నారు. అయితే ఇటీవలే ఇలాంటి పాములే తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో గమనించినట్లయితే ఓ వ్యక్తి తన ఇంట్లో పడుకొని ఉంటాడు. ఇదే క్రమంలో ఓ పెద్ద కొండచిలువ ఇంట్లోకి ప్రవేశించి అతని పక్కన నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. అయితే దీనిని గమనించిన ఆ నిద్రపోతున్న వ్యక్తి వెంటనే నిద్ర లోంచి మేలుకొని.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
అయితే అతను భయపడి వెంటనే ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. బయటికి వెళ్ళిపోయి తన స్నేహితుడిని తీసుకువచ్చి ఆ అనకొండను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ పాము వాళ్లకు చిక్కనే లేదు. ఇలా చాలాసేపు పాములు పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ పాము చిక్కనే లేదు.
ఈ పాము వీడియోను జియాన్ట్ కింగ్ కోబ్రా హంటర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగు వైరల్ గా మారింది. ఈ వీడియోను 4 లక్షల మంది వీక్షించగా 2వేలకు పైగా మంది లైక్ చేశారు. అయితే ఇలాంటి కింగ్ కోబ్రాలు ఇళ్లలోకి రావడం చాలా అరుదని నెటిజెన్లు కామెంట్ల రూపంలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Ori Devuda Vs Ginna : విశ్వక్ సేన్‌ను కూడా దాటని మంచు విష్ణు
Also Read : Actress Anjali Pavan : అమ్మ మాత్రమే.. నాన్న లేరు.. స్టేజ్ మీద ఏడిపించేసిన మొగలిరేకులు అంజలి పవన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook