Supreme Court Of India: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి అభ్యర్థనను అంగీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో నిష్పక్షపాతంగా ట్రయల్ సాగే అవకాశం లేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తేల్చేసింది.
Supreme Court Of India: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి అభ్యర్థనను అంగీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో నిష్పక్షపాతంగా ట్రయల్ సాగే అవకాశం లేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తేల్చేసింది. సాక్షులకు రక్షణ కల్పించాల్సిన పరిస్థితికి ఈ కేసు చేరుకోవడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్టు స్పష్టం చేసింది. సాక్షులకు ముప్పు ఉందని కోర్టును సీబీఐ ఆశ్రయించడం, ముప్పుపై కమిషనర్ నివేదిక ఇవ్వడం, దాని ఆధారంగా వారికి భద్రత కల్పించడం... వంటి పరిణామాలే కేసు విచారణను బదిలీ చేయడానికి కారణమని వివరించింది.