Five major changes in Public Provident Fund: పీపీఎఫ్ అకౌంట్ ద్వారా డబ్బులు దాచుకోవలని అనుకుంటున్నారా.. అయితే దీని గురించి మీరు తెలుసుకోవాల్సిందే. భారత ప్రభుత్వం పీపీఎఫ్, సమ్రుద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై) పథకాలలో మార్పులు చేసింది. అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే దీన్ని చదవండి.
పీపీఎఫ్ ఖాతాల నిబంధనలు మారుస్తూ భారత ప్రభుత్వం ఐదు కీలక మార్పులను చేసింది. ఇక మీదట పీపీఎఫ్ అకౌంట్ తెరవాలనుకునేవారు వీటిన కచ్చితంగా దష్టిలో పెట్టుకోవాలని చెప్పింది. ముందుగానే తెలుసుకుని వెళ్ళకపోతే.. నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. పీపీఎఫ్ విషయంలో భారత ప్రభుత్వం చేసిన ప్రధాన మార్పులు ఇలా ఉన్నాయి.
# 15 ఏళ్ళ తర్వాత కూడా డబ్బులు కట్టకపోయినా పీపీఎఫ్ అకౌంట్ ను కొనసాంగిచవచ్చు. అప్పడు తప్పనిసరిగా డబ్బులు డిపాజిట్ చేయాలనే రూల్ ఏమీ ఉండదు. డబ్బులు డిపాజిట్ చేయకపోయినా అకౌంట్ డీ యాక్టివేట్ అయిపోదు. అలాగే అకౌంట్ మెచ్యూరిటీ అయిన తర్వాత ఒక ఆర్ధిక సంవత్సరానికి ఒకసారి డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.
# పీపీఎఫ్ అకౌంట్ ఆధారంగా లోన్ తీసుకోవాలనుకుంటే.. మన అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ లో 25 శాతం మాత్రమేయ తీసుకోగలము. అది కూడా లాస్ట్ రెండు సంవత్సరాల నగదును కౌంట్ చేసి లోన్ తీసుకోవచ్చునో లేదో నిర్ధారిస్తారు. ఉదాహరణకు మీరు 2022 అక్టోబర్ 31 సంవత్సరంలో లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. అంటే 2020 అక్టోబర్ ౩౦ నుంచీ మీ అకౌంట్ లో లక్ష రూపాయలు ఉంది అనుకుంటే.. అందులో ఇరవై ఐదు శాతం మాత్రమే మీకు లోన్ గా ఇస్తారు. ఇరవై ఐదు వేలు మాత్రమే లోన్ వస్తుంది.
# అలాగే పీపీఎఫ్ లోన్ మీద ఉన్న ఇంట్రస్ట్ రేటును కూడా తగ్గించారు. ఇది రెండు శాతం నుంచి ఒక శాతానికి తగ్గించారు. అంటే అసలు మొత్తం చెల్లించే లోపు రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఇంట్రస్ట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇంట్రస్ట్ ప్రతీ నెలా మొదటి తేదీన కాలిక్యులేట్ చేస్తారు.
# పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇంతకుముందు ఫారం A సమర్పించాల్సి ఉండగా.. ఇప్పుడు ఫారం-1 సమర్పించాలి. 15 ఏళ్ళ తరువాత పీపీఎఫ్ మెచ్యురిటీ అయ్యే వన్ ఇయర్ ముందు ఫారం-4 ఇవ్వాల్సి ఉంటుంది.
# పీపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేసే మొత్తం 5౦౦ కన్నా ఎక్కువ ఉండాలి. ఇది కూడా వన్ ఇయర్ కు 5౦౦ లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. అలాగే మనం చేసే డిపాజిట్ సంవత్సరం మొత్తానికి లక్షా యాభై వేలు దాటకూడదు. నెలకు ఒకసారి మాత్రమే పీపీఎఫ్ లో డబ్బులు జమ చేయగలము.
Also Read: YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. హంతకులెవరో తేలనుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook