Chhello Show film child actor Rahul Koli passes away due to Cancer: గుజరాతీ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారత్ తరఫున ఆస్కార్‌కు నామినేట్ అయిన 'ఛెల్లో షో' (ద లాస్ట్ షో) సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ రాహుల్ కోలీ మృతి చెందాడు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న రాహుల్ మంగళవారం (అక్టోబర్ 11) తుదిశ్వాస విడిచాడు. మరో రెండు రోజుల్లో ఛెల్లో షో సినిమా విడుదల కానుంది. అంతలోనే 10 ఏళ్ల రాహుల్ మరణం అందరి హృదయాలను కలిచివేస్తోంది.
ఇటీవలి రోజులలో రాహుల్ కోలీకి పదేపదే జ్వరం బారిన పడినట్టు ఛెల్లో షో సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ తండ్రి రాము కోలీ తెలిపారు. రాహుల్ రక్తపు వాంతులు చేసుకున్నాడని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే తమ కళ్ల ముందే చనిపోయాంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 14న కుటుంబంతో కలిసి ఛెల్లో షో సినిమా చూడాలనుకున్నామని, ఇంతలోనే రాహుల్ తిరిగిరాని లోకాలకు వెళ్లాడని రాము కోలీ కన్నీరుమున్నీరు అయ్యారు.
ఓ తొమ్మిదేళ్ల కుర్రాడు సినిమాని అమితంగా ఇష్టపడే కథతో ఛెల్లో షో చిత్రంను రూపొందింది. ఈ సినిమాకు దర్శకుడు నళిన్ పాన్. డైరెక్టర్ నళిన్ స్వీయ అనుభవాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో బాల నటుడు భవిన్ రాబరి ప్రధాన పాత్ర పోషించగా.. భవేశ్ శ్రీమాలి, రిచా మీనా, రాహుల్ కోలి, దిపెన్ రావల్, పరేశ్ మెహతా.. తదితరులు కీలక పాత్రలు పోషించారు. మొత్తం ఆరుగురు పిల్లలు నటించగా.. వారిలో రాహుల్ ఒకడు.
ఛెల్లో షో సినిమాను తొలిసారి 2021జూన్‌లో ట్రిబెకా చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ప్రస్తుతం భారత్ తరఫున అధికారికంగా ఆస్కార్ 2023 (95వ ఆస్కార్‌లో ఉత్తమ విదేశీ చిత్రంగా)లో బరిలోకి దిగుతోంది. ఈ సినిమా ఇప్పటికే గోల్డెన్ స్పైక్ పురస్కారం గెలుచుకుంది. అంతేకాదు పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది.
Also Read: ఇదేందయ్యో ఇది.. దీన్ని నేనెక్కడా చూడలే! వీడి డాన్స్ చూస్తే షాక్ అవ్వడం పక్కా
Also Read: అచ్చు భక్తుల మాదిరిగానే.. దేవుడి ముందు మోకరిల్లిన మేక! ఏం ప్రార్థించిందో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook