Ghee in High Cholesterol: శరీరానికి నెయ్యి చాలా అవసరం. కాబట్టి శరీరానికి మంచి కొలెస్ట్రాల్ అధిక పరిమాణంలో ఉండే నెయ్యి చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని ఆహారంలో వినియోగించడం వల్ల శరీరానికి విటమిన్లు, కాల్షియం, పొటాషియంతో పాటు, మంచి కొవ్వులు లభిస్తాయి. కాబట్టి నెయ్యిని తీసుకోవడం వల్ల శరీరం బలంగా దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ కూడా సక్రమంగా పని చేస్తుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే మూలకాలు చర్మ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి దీనిని క్రమం తప్పనకుండా తీసుకోవచ్చు. అయితే ఇప్పటికే చెడు కొలెస్ట్రాల్, అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో ఉన్నవారు తినొచ్చని సందేహం కలగవచ్చు. అయితే ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో మనం తెలుసుకుందాం..
ఆయుర్వేదంలో దీనిని ఔషధంగా ఉపయోగిస్తారు:
నెయ్యిలో అధిక పరిమాణంలో పోషకాల లభిస్తాయి. కాబట్టి ఆయుర్వేదంలో దీనిని ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు గుండెకు మాత్రమే కాదు.. జీర్ణక్రియను దృఢంగా చేసేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ నెయ్యి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడమేకాకుండా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే కొలెస్ట్రాల్ స్థాయిలను చెక్ పెట్టేందుకు తక్కువ పరిమాణంలో మాత్రమే వినియోగించాలి.
అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారు నెయ్యిని తినొచ్చా?:
అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు కూడా నెయ్యి తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీని కోసం వారు నెయ్యిని సమతుల్యంగా తీసుకోవాల్సి ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు రోజూ 2 నుంచి 3 చెంచాల నెయ్యి తింటే మంచి కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
శరీరంలో 2 రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి:
ప్రతి మనిషి శరీరంలో 2 రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఆరోగ్యం క్షీణించిన వారిలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ చెడు కొలెస్ట్రాల్‌ను LDL అని పిలుస్తారు. అయితే దీంతో పాటు మంచి కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. దీనిని లిపోప్రొటీన్ (HDL) అంటారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా గుండె పోటు, మధుమేహం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook