CM Jagan: మరోమారు పెద్ద మనసు చాటిన ఏపీ సీఎం జగన్..చిన్నారి వైద్యానికి కోటి సాయం..!

CM Jagan: ఏపీ సీఎం జగన్..మరో హామీని నెరవేర్చారు. ఇటీవల కోనసీమ జిల్లాలో చిన్నారికి ఇచ్చిన హామీని ఆచరణలో పెట్టారు. ఇందులోభాగంగా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. 

Written by - Alla Swamy | Last Updated : Oct 2, 2022, 06:08 PM IST
  • మరో హామీని నెరవేర్చిన సీఎం
  • చిన్నారి వైద్యానికి బడ్జెట్ కేటాయింపు
  • హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
CM Jagan: మరోమారు పెద్ద మనసు చాటిన ఏపీ సీఎం జగన్..చిన్నారి వైద్యానికి కోటి సాయం..!

CM Jagan: మరోసారి ఏపీ సీఎం జగన్ పెద్ద మనసును చాటారు. అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హనీ వైద్యానికి ఏకంగా రూ. కోటి బడ్జెట్‌ను కేటాయించారు. ఇందులోభాగంగానే అత్యంత ఖరీదైన 10 ఇంజక్షన్లను కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు అందించారు. చిన్నారిని చదివించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. నెలకు రూ.10 వేల చొప్పున పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 

కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామేరానికి చెందిన రాంబాబు, నాగలక్ష్మీ దంపతులకు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి హనీకి గాకర్స్ వ్యాధి సోకింది. ఈవ్యాధి వల్ల కాలేయం పనిచేయదు. ఇటీవల గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. ఈసందర్భంగా కోనసీమ జిల్లా గంటి పెద్దపూడిలో పర్యటించారు. ఆ సమయంలో చిన్నారిని కాపాడాలంటూ చిన్నారి తల్లిదండ్రులు ప్లకార్డులు ప్రదర్శించారు. 

ఇది చూసిన సీఎం జగన్..కాన్వాయ్‌ను ఆపి వారితో మాట్లాడారు. అనంతరం వారిని తన వద్దకు తీసుకురావాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. హెలిపాడ్ వద్ద వచ్చిన వారితో ఆయన మాట్లాడారు. వైద్యం గురించి ఆరా తీశారు. చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని..ఎంత ఖర్చు అయిన భరిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. 

కలెక్టర్ పంపిన ప్రతిపాదనలను సీఎం జగన్ పరిశీలించారు. తాజాగా కోటి రూపాయలను మంజూరు  చేశారు. రూ.10 వేల పెన్షన్ మంజూరు చేయాలన్నారు. ఇవాళ అమలాపురంలోని ప్రాంతీయ ఆస్పత్రిలో ఉన్న చిన్నారిని ఇంజక్షన్లను కలెక్టర్ పంపిణీ చేశారు. గాకర్స్ వ్యాధి నివారణకు ప్రభుత్వం 52 ఇంజక్షన్లను మంజూరు చేసింది. ప్రస్తుతం 13 ఇంజక్షన్లను సంబంధిత ఆస్పత్రికి అందించారు. ఒక్కో ఇంజక్షన్ ధర లక్షా 25 వేలుగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు.  

ప్రతి 15 రోజులకు ఓ ఇంజక్షన్‌ను క్రమం తప్పకుండా చిన్నారికి ఇవ్వనున్నారు. చికిత్సతోపాటు చిన్నారి చదువుపై సీఎం జగన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రతి నెలా రూ.10 వేల పెన్షన్ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా చెప్పారు. దేశంలో ఈవ్యాధి చాలా అరుదుగా సంక్రమిస్తుందన్నారు. 

Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తన ఎఫెక్ట్..మరికొన్ని రోజులు వానలే వానలు..!

Also read:Congress President Election: పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యం..శశిథరూర్‌కు మల్లికార్జున ఖర్గే కౌంటర్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News