Singer Mangli : సింగర్ మంగ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్ మొత్తం కూడా సింగర్ మంగ్లీ ఫేమస్ అయింది. ఈషా ఫౌండేషన్, సద్గురు ఈవెంట్లో మంగ్లీ పాడే పాటలకు అందరూ ఫిదా అవుతుంటారు. భక్తి పారవశ్యంలో మునిగి తేలుతుంటారు. సింగర్ మంగ్లీ గాత్రానికి ఆ శివుడు సైతం మైమరిచిపోవాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. శివుడి పాటను మంగ్లీ పాడితే.. అందరినీ హత్తుకునేలా ఉంటుంది. జానపదాలు, తెలుగు సినిమా పాటలు, ఐటం సాంగ్స్ కూడా మంగ్లా పాడేస్తోంది.
మంగ్లీ పాటలు ఎంతగా వైరల్ అవుతుంటాయో.. ఆమె మీద వచ్చే కాంట్రవర్సీలు కూడా అంతే స్థాయిలో వైరల్ అవుతుంటాయి. ఊరికే మంగ్లీ మీద కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుంటారు. ఆ మధ్య బోనాల పాట, పెద్దమ్మ తల్లి అంటూ పాడిన పాట మీద కాంట్రవర్సీని క్రియేట్ చేశారు. మోతేవరి అని పదం మీద చర్చ జరిగింది. అమ్మవారిని అలా ఎలా అంటుంది అని నానా రకాలుగా అర్థం పర్థంలేని ట్రోలింగ్ చేశారు. పాటను రాసిన వారి మీద గానీ, ట్యూన్ చేసిన వారిని గానీ నిందించకుండా.. పాటను పాడిన మంగ్లీని మాత్రమే అందరూ ట్రోల్ చేశారు.
అయితే మంగ్లీ ఆ కాంట్రవర్సీల మీద స్పందించింది. నాకు భక్తి ఎక్కువే.. నేను దేవుడ్ని ఆరాధిస్తాను అంటూ కాంట్రవర్సీలు పట్టించుకోను అని చెప్పుకొచ్చింది. అయితే మంగ్లీ తన ఊర్లో చిన్న గుడిని కూడా కట్టించినట్టు తెలుస్తోంది.ఇక మరో సందర్భంలో ఓ వీడియో ట్రోలింగ్ జరిగింది. ఓ అభిమాని దగ్గరకు వస్తే.. సెల్ఫీ ఇవ్వకుండా పరిగెత్తించినట్టు కనిపించింది. అలా మంగ్లీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.
పుష్ప ఐటం సాంగ్ ఊ అంటావా మామ ఊ ఊ అంటావా? అనే పాటతో ఒక్కసారిగా అందరినీ ఊపేసింది. సింగర్ మంగ్లీ ఈ పాటను కన్నడలో పాడింది. ఆమె సోదరి ఇంద్రావతి తెలుగులో పాడింది. అలా ఈ పాటతో ఒక్కసారిగా అక్కాచెల్లెళ్లు ట్రెండింగ్‌లోకి వచ్చారు. అయితే తాజాగా కన్నడలో తన క్రేజ్ ఎలా ఉందో చూపించేందుకు శాంపిల్‌గా ఓ వీడియోను వదిలింది. ఆమెను ఓ యువరాణిలా పల్లకిలో మోసుకొచ్చారు. మీ అభిమానానికి సంతోషం అని, నాకు పట్టలేని ఆనందంగా ఉందని, కన్నడ బంధుగులు (కన్నడ బంధువులు) అందరికీ థాంక్స్ అంటూ సింగర్ మంగ్లీ మురిసిపోయింది. ప్రస్తుతం సింగర్ మంగ్లీ వీడియో మాత్రం నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.
Also Read :కంటెస్టెంట్లతో ఆడుకుంటున్న హోస్ట్.. నాగార్జున ఆన్ ఫైర్
Also Read : Prithvi raj : భార్యకు నెలకు రూ. 8 లక్షల భరణం.. ధర్టీ ఇయర్స్ ఫృధ్వీకి కోర్టు షాక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి