Rajiv Swagruha Flats Auction: బండ్లగూడ, పోచారం రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు మరోసారి వేలం

Bandlaguda, Pocharam Rajiv Swagruha Flats: హైదరాబాద్‌లో నాగోల్ సమీపంలో ఉన్న బండ్లగూడ, ఘట్ కేసర్ సమీపంలో ఉన్న పోచారం రాజీవ్ స్వగృహ టౌన్‌షిప్‌లలో మిగిలిన ప్లాట్లను వేలం వేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటి (హెచ్ఎండీఏ) అధికారులు సిద్ధమయ్యారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 30, 2022, 02:48 AM IST
  • బండ్లగూడ, పోచారం రాజీవ్ స్వగృహ టౌన్‌షిప్‌లలో మిగిలిన ప్లాట్లకు వేలం
  • గతంలో రిజిస్టర్ చేసుకున్న వారికి మరొక అవకాశం
  • టొకెన్ అడ్వాన్స్ చెల్లించేందుకు ఆఖరి తేది నిర్ణయించిన హెచ్ఎండిఏ అధికారులు
Rajiv Swagruha Flats Auction: బండ్లగూడ, పోచారం రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు మరోసారి వేలం

Bandlaguda, Pocharam Rajiv Swagruha Flats: హైదరాబాద్‌లో నాగోల్ సమీపంలో ఉన్న బండ్లగూడ, ఘట్ కేసర్ సమీపంలో ఉన్న పోచారం రాజీవ్ స్వగృహ టౌన్‌షిప్‌లలో మిగిలిన ప్లాట్లను వేలం వేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటి (హెచ్ఎండీఏ) అధికారులు సిద్ధమయ్యారు. గతంలో నిర్వహించిన వేలంలో అమ్ముడవకుండా మిగిలి ఉన్న అన్ని ఫ్లాట్లను మరోసారి వేలం వేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

రాజీవ్ స్వగృహలో ప్లాట్ల వేలంలో పాల్గొనేందుకు గతంలో రిజిస్టర్ చేసుకున్న వారికి కూడా మరొక అవకాశం కల్పిస్తున్నట్టు హెచ్ఎండిఏ అధికారులు స్పష్టంచేశారు. టొకెన్ అడ్వాన్స్ చెల్లించేందుకు అక్టోబర్ 26వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. 

హెచ్ఎండిఏ అధికారులు నిర్ణయించిన స్లాబుల ప్రకారం వేలంలో 1 బెడ్ రూమ్, హాల్, కిచెన్ కలిగిన ఫ్లాట్లను కొనుగోలు చేయాలనుకునే వారు ఒక లక్ష.. అలాగే రెండు బెడ్ రూమ్స్, హాల్ విత్ కిచెన్ కలిగిన ఫ్లాట్లను సొంతం చేసుకోవాలనుకునే వారు 2 లక్షలు రూపాయలు టొకెన్ అడ్వాన్స్ కింద చెల్లించాల్సి ఉంటంది. 3 BHK ఫ్లాట్లకు పోటీపడే వారు 3 లక్షల రూపాయల టొకెన్ అడ్వాన్స్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. టోకెన్ అడ్వాన్స్ చెల్లించి వేలం బిడ్డింగ్‌లో పాల్గొన్న వారికి ఎప్పటిలాగే లాటరీ పద్ధతిలో ఫ్లాట్లను (Rajiv Swagruha Flats Allotment) కేటాయించనున్నట్టు హెచ్ఎండీఏ అధికారులు స్పష్టంచేశారు.

Also Read : Telangana Rains: తెలంగాణలో కుండపోత వర్షాలు..వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ..!

Also Read : Ys Sharmila: వైఎస్‌ఆర్ ఉంటే కాంగ్రెస్‌పై ఉమ్మి వేసేవారు..షర్మిల సంచలన వ్యాఖ్యలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News