ఆందోళనకారుల దాడిలో కలెక్టరేట్ ధ్వంసం..ఒకరు మృతి

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Last Updated : May 22, 2018, 03:03 PM IST
ఆందోళనకారుల దాడిలో కలెక్టరేట్ ధ్వంసం..ఒకరు మృతి

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్టెరిలైట్‌ కాపర్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 100వ రోజు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఫ్యాక్టరీ తొలగింపుకు డిమాండ్ చేస్తూ స్థానికంగా ఉన్న వాహనాలపై ఆందోళనకారులు దాడి చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమై కాల్పులు జరపగా.. ఓ వ్యక్తి మరణించారు. పోలీసులకూ, నిరసనకారులకు మధ్య జరిగిన దాడిలో పోలీసులకూ గాయాలయ్యాయి.  

గత కొన్ని నెలలుగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదంటూ.. జనం రోడ్డెక్కారు. రాళ్లతో దాడికి యత్నించారు. పరిస్థితి అదుపుతప్పడంతో టియర్ గ్యాస్, ఆపై లాఠీఛార్జ్ చేశారు. ఎంతకూ పరిస్థితి కంట్రోల్ కాకపోవడంతో పోలీసులు ఫైరింగ్ జరిపారు.

అటు ఈ పరిణామంతో మరింత రెచ్చిపోయిన నిరసనకారులు కలెక్టరేట్‌ భవనాన్ని ద్వంసం చేశారు. అనంతరం అక్కడే ఆగి ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో తూత్తుకుడిలో యుద్ధవాతావరణం తలపించింది. ఈ పరిస్థితులతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు అదనపు బలగాలను రంగంలోకి దించారు. ముందస్తు జాగ్రత్తగా తూత్తుకుడిలో 144 సెక్షన్ విధించి, విద్యుత్ సరఫరా నిలిపివేశారు.  

 

 

Trending News