How To Purify Blood Home Remedies: శరీరం అవయవాలు ఆరోగ్యంగా ఉంటేనే బాడీ అరోగ్యంగా, దృఢంగా ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. శరీరం ఆరోగ్యంగా ఉండడానికి రక్తం శుద్ధి ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఉండే గుణాలు శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్, పోషణను అందించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కాలుష్య కారకాలు, వ్యర్థాలను కూడా తొలగిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు బాడీని యాక్టివ్‌గా మారుతుంది. అయితే రక్తం శుద్ధి చేసే ఆహారాలను తీసుకోవడం వల్ల మూత్రపిండాలు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, శోషరస వ్యవస్థ కూడా సక్రమంగా పని చేస్తాయి. ముఖ్యంగా శరీరంపై వచ్చే వాపులను తగ్గించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే రక్తం శుద్దీ కావడానికి ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
రక్తం శుద్ధి కావడానికి ఈ ఆహారాలను తీసుకోండి:
1. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్:
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్‌లో బాడీకి అవసరమైన చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి మంచి లాభాలు చేకూరుతాయి. ఇందులో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించేందుకు సహాయపడతాయి. అయితే దీని కోసం కాలే, పాలకూర, బచ్చలికూరను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
2. అవకాడో:
అవకాడోలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రక్త శుద్ధిని చేసేందుకు సహాయపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు సహాపడుతుంది. అవోకాడోలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించేందుకు సహాయపడుతాయి. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు చర్మాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది.
3.బ్రోకలీ:
బ్రోకలీలో ఉండే మూలకాలు కూడా శరీరంలో వ్యర్థాలను తొలగించేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా ఇందులో కాల్షియం, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ సి, పొటాషియం, మాంగనీస్, ఫాస్పరస్ లభిస్తాయి. కాబట్టి వీటిని ఆహారంగా తీసుకుంటే.. శరీర సమస్యలు దూరమవుతాయి. కాబట్టి బాడీ సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా వీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
4. నిమ్మకాయ:
నిమ్మకాయను శతాబ్దాల నుంచి ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే.. శరీరం నుంచి అన్ని రకాల టాక్సిన్స్ బయటకు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలో విటమిన్ సి, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది రక్తాన్ని సులభంగా శుభ్రం చేస్తయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook