King Cobra Viral Video: మోరీలో దూరిన భారీ కింగ్ కోబ్రా.. ఈ వ్యక్తి ఎలా పట్టాడో చూడండి!

King Cobra Viral Video, Snake Catcher Vava Suresh Caught  King పట్టుకున్నాడుCobra. కేరళలో స్నేక్ క్యాచర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వావ సురేష్ మోరీలో దాగిన భారీ కింగ్ కోబ్రాను సైతం బయటికి రప్పించి మరీ .   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 19, 2022, 03:55 PM IST
  • మోరీలో దూరిన భారీ కింగ్ కోబ్రా
  • ఈ వ్యక్తి ఎలా పట్టాడో చూడండి
  • వీడియోకి 720,793 వ్యూస్
King Cobra Viral Video: మోరీలో దూరిన భారీ కింగ్ కోబ్రా.. ఈ వ్యక్తి ఎలా పట్టాడో చూడండి!

Snake Catcher Vava Suresh caught 11ft King Cobra easily in Village: ప్రపంచంలోనే అత్యంత పొడవైన విష సర్పాలలో కింగ్ కోబ్రా ఒకటి. కింగ్ కోబ్రా సాధారణంగా 18.5 అడుగుల పొడవు, 8 కిలోల బరువు ఉంటుంది. కింగ్ కోబ్రా విషయం మనిషి మెదడుపై అత్యంత ప్రభావాన్ని చూపుతుంది. కింగ్ కోబ్రా కాటు వేస్తే.. మనిషి 10 నిమిషాల్లో చనిపోతాడు. సాధారణ పాము లానే కింగ్ కోబ్రా విషయం ఉన్నా.. అది కాటేసే సమయంలో ఎక్కువ విషం చిమ్ముతుంది కాబట్టి ప్రమాదకరం. ఎక్కువగా అడవుల్లో ఉండే కింగ్ కోబ్రా.. చాలా అరుదుగా జనావాసాల్లోకి వస్తుంది. అలా వచ్చిన కింగ్ కోబ్రా ఒక్కోసారి జనాల చూసి పారిపోవడానికి ప్రయతిస్తుంది. 

స్నేక్ క్యాచర్‌ వావ సురేష్ కేరళలో చాలా ఫేమస్. అంతరించిపోతున్న పాములను రక్షించడమే మనోడి లక్ష్యం. ఈ క్రమంలోనే జనాల్లోకి వచ్చిన భారీ కింగ్ కోబ్రాలను సైతం సురేష్ చాలా సునాయాసంగా పట్టుకుని అడవుల్లో వదిలేస్తుంటాడు. కింగ్ కోబ్రాను ఉత్తచేతులతోనే చాలా సులువుగా పడతాడు. ఇప్పటికే ఎన్నో కింగ్ కోబ్రాలను పట్టి అడవుల్లో వదిలేశాడు. మోరీలో దాగిన భారీ కింగ్ కోబ్రాను సైతం బయటికి రప్పించి మరీ పట్టుకున్నాడు. 

కేరళలలో ఓ కింగ్ కోబ్రా ఓ గ్రామంలోని మోరీలో దాక్కుంటుంది. స్నేక్ క్యాచర్‌ వావ సురేష్ సమాచారం అందుకుని రాత్రి వేల అని చూడకుండా అక్కడికి వెళతాడు. చాలా పొడవు ఉన్న మోరీలో పాము ఉండడంతో దాని చూసేందుకు జనాలు ఎగబడతారు. సురేష్ ఓ కర్రను మోరీలో పెట్టగానే అది మరో వైపు నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. జనాలను చూసి.. సురేష్ ఉన్న ఎండ్ నుంచే బయటికి వస్తుంది. వెంటనే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. అది కాటేయడానికి మీదికి దూసుకొస్తోంది. దాని కాటు నుంచి తప్పించుకున్న సురేష్ కాసేపటి అనంతరం దాని పట్టుకుని బంధిస్తాడు. ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోకి 720,793 వ్యూస్ వచ్చాయి. 

Also Read: Khammam: లిఫ్ట్‌ పేరుతో ఇంజెక్షన్‌ దాడి..ఖమ్మం జిల్లాలో దారుణం..!

Also Read: Rain Alert: తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న అల్పపీడన ముప్పు..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News