Aloevera Gel Face Pack: చర్మం సౌదర్యంగా ఉండాలంటే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చర్మాన్ని సంరక్షించుకోవడానికి తప్పకుండా మంచి ఆహారాలను తీసుకోవాలి. అయితే ప్రస్తుతం చాలా మంది చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే దీని కోసం ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్న వివిధ రకాల మూలికాలను వినియోగించాల్సి ఉంటుంది. అయితే చర్మంపై వృద్ధాప్య ప్రభావం పడితే.. అలోవెరాతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ను వినియోగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు ముఖానికి మెరుగును ఇవ్వడమేకాకుండా వివిధ రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. అయితే ఈ ఫేస్ ఫ్యాక్ వల్ల చర్మానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
అలోవెరా జెల్ ఫేస్ ప్యాక్:
>>చర్మాన్ని అందంగా చేసేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు శరీరానికి ప్రోటిన్లను కూడా అందజేస్తాయి. చర్మ సౌంద్యం కోసం ఫేస్ ఫ్యాక్‌ను తయారు చేసుకోవడానికి ముందుగా 1 టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జులో తగినంత రోజ్ వాటర్ వేసి..అందులో అలోవెరా జెల్‌ను మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా ముఖానికి అప్లై చేస్తే చాలు ముఖం తాజాగా కనిపిస్తుంది.
>>ముఖం ఎల్లపుడు మెరవడానికి కలబంద, తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా తాజా అలోవెరా జెల్‌ను చిటికెడు పసుపుతో కలిపి కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముడతల గల చర్మాన్ని తగ్గిస్తుంది.
>>కలబందతో చేసిన ప్యాక్‌ను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మాన్ని మృదువుగా మారుతుంది. అంతేకాకుండా ఇతర చర్మ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని నిపుణలు తెలుపుతున్నారు. ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖానికి అప్లై 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు.
Also Read: Telugu Movies this Week: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!
Also Read: Amala Paul on Tollywood: టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్.. నెపోటిజం, రొట్ట సినిమాలు అంటూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Aloevera Face: ఈ ఫేస్ ఫ్యాక్‌తో కేవలం 5 నిమిషాల్లో చర్మాన్ని నిగనిగ లాడించవచ్చు..
చర్మ సమస్యలతో బాధపడుతున్నారా..
అలోవెరా జెల్ ఫేస్ ప్యాక్‌ను వినియోగించండి
ఇలా చేస్తే చర్మం నిగనిగ లాడుతుంది.