Fuel Price: రోజురోజూ పెరుగుతున్న ఇంధన ధరల విషయంలో ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుందని తెలుస్తోంది. పండుగ సీజన్ వచ్చేసరికి పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టవచ్చని సమాచారం..ఆ వివరాలు మీ కోసం..
రానున్న పండుగ సీజన్లో సామాన్య ప్రజలకు ఊరట కల్గించే గుడ్‌న్యూస్ లభించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల్లో తగ్గుదల కారణంగా త్వరలోనే అంటే పండుగ నాటికి దేశంలో పెట్రోల్ - డీజిల్ ధరలు తగ్గే అవకాశాలున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు 2-3 రూపాయలు తగ్గవచ్చని అంచనా. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 92 రూపాయల కంటే తక్కువ ఉంది. క్రూడ్ ఆయిల్ ధరల్లో కూడా 5 శాతం తగ్గుదల కన్పిస్తోంది.
క్రూడ్ ఆయిల్ ధరలు వరుసగా తగ్గుతుండటంతో భారతదేశ ఆర్ధిక వ్యవస్థపై పాజిటివ్ ప్రభావం కన్పించవచ్చు. క్రూడ్ ఆయిల్ ధరల్లో తగ్గుదల కారణంగా దేశీయ మార్కెట్లో పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గనున్నాయి. దాంతోపాటు ద్రవ్యోల్బణం కూడా తగ్గవచ్చు.
క్రూడ్ ఆయిల్ ధరల తగ్గుదల వల్ల వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. అంతేకాకుండా చైనా లాక్డౌన్ కూడా మాంద్యానికి కారణంగా తెలుస్తోంది. చైనా..ఇండియాకు అతిపెద్ద ఇంపోర్టర్‌గా ఉండటం వల్ల ఆ ప్రభావం నేరుగా డిమాండ్‌పై పడనుంది. దేశంలో మే 22వ తేదీన పెట్రోల్-డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం ఎక్స్చైజ్ డ్యూటీ తగ్గించినప్పటి నుంచి పెద్దగా మార్పులు లేవు.
ఢిల్లీలో లీటరు పెట్రోల్ 96.72 రూపాయలు కాగా, డీజిల్ 89.62రూపాయలుగా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ 11.35 రూపాయలు కాగా, డీజిల్ 97.28 రూపాయలుగా ఉంది. ఇక చెన్నైలో లీటరు పెట్రోల్ 102.63 రూపాయలు కాగా, డీజిల్ 94.24 రూపాయలుంది. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ 106,03 రూపాయలైతే..డిజిల్ ధర 92.76 రూపాయలుంది.
Also read: Share Market: 20 ఏళ్ల విద్యార్ధికి నెలరోజుల్లో షేర్ మార్కెట్ ద్వారా 664 కోట్ల లాభాలు, ఎలాగంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook