Share Market: షేర్ మార్కెట్ ఒక్కోసారి ఊహించని లాభాల్ని కురిపిస్తుంది. ఇంకొన్నిసార్లు అలాగే నాశనం చేస్తుంది కూడా. 20 ఏళ్ల విద్యార్ధి కేవలం నెల రోజుల వ్యవధిలో 664 కోట్లు సంపాదించాడంటే నమ్ముతారా..ఆ వివరాలు మీ కోసం..
షేర్ మార్కెట్..ఇన్వెస్టర్లకు అమితమైన లాభాల్ని ఆర్జించి పెడుతోంది. ఇండియానే కాకుండా..అంతర్జాతీయ మార్కెట్లో సైతం ఇన్వెస్టర్లను కోటీశ్వరుల్ని చేస్తోంది. ఓ 20 ఏళ్ల విద్యార్ధి స్టాక్ మార్కెట్లో 215 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి..కేవలం నెలరోజుల్లోనే స్టాక్స్ అమ్మేశాడు. నెలరోజుల్లో అతడికి దాదాపుగా 878 కోట్లు వచ్చి పడ్డాయి. అంటే నెలరోజుల్లో అతనికొచ్చిన లాభం 664 కోట్ల రూపాయలు. ఆశ్యర్యంగా ఉందా..
అమెరికాలో జరిగిన ఘటన
ఈ సంఘటన అమెరికాకు చెందింది. 20 ఏళ్ల విద్యార్ధి పేరు జేక్ ఫ్రీమ్యాన్. యూనివర్శిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియాలో విద్యార్ధి ఇతడు. ఇతడు Bed Bath and Beyond షేర్లు కొనుగోలు చేశాడు. తద్వారా భారీగా లాభాల్ని ఆర్జించాడు.
664 కోట్ల లాభం ఎలా వచ్చింది
ఈ విద్యార్ధి ఒక్కొక్క షేర్ 440 రూపాయలు చొప్పున 50 లక్షల షేర్లు కొనుగోలు చేశాడు. దీనికోసం 215 కోట్లు వెచ్చించాడు. కేవలం ఓ నెల రోజుల్లో షేర్ విలువ 2160 రూపాయలకు చేరుకోగానే..ఇంకా నిరీక్షించకుండా అన్ని షేర్లు అమ్మేశాడు. అంతే 664 కోట్ల లాభంతో 878 కోట్లు ఆర్జించాడు. కుటుంబసభ్యులు, స్నేహితుల్నించి అప్పు తీసుకుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్టు జేక్ ఫ్రీమ్యాన్ చెబుతున్నాడు.
DailyMail.com అందించిన వివరాల ప్రకారం జేక్ ఫ్రీమ్యాన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తారని తల్లిదండ్రులు భావించారట. తన చిన్నాన్నతో స్టాక్స్ గురించి వివరాలు చర్చించి దాదాపు 215 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఎక్కువకాలం నిరీక్షించకుండా..నెలరోజుల్లో షేర్ విలువ 2160 రూపాయలకు చేరుకోగానే..అన్నింటినీ అమ్మేశాడు. అంటే నెల రోజుల్లో అతడి లాభం ఏకంగా 664 కోట్ల రూపాయలు.
Also read: Reliance Jio: జియో బంపరాఫర్.. రూ.10 లక్షల విలువైన బహుమతులు గెలుచుకునే ఛాన్స్.. ఆఫర్ ఇంకా 4 రోజులే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook