India vs Hong Kong : పసికూన హాంకాంగ్‌పై టీమిండియా ఘనవిజయం.. చితక్కొట్టిన సూర్య కుమార్ యాదవ్..

Asia Cup India vs Hong Kong Highlights: ఆసియా కప్‌లో పసికూన హాంకాంగ్‌పై విజయంతో టీమిండియా 'సూపర్ 4'కి దూసుకెళ్లింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్‌లో నిలిచింది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 1, 2022, 07:25 AM IST
  • ఆసియా కప్ లేటెస్ట్ అప్‌డేట్స్
  • ఇండియా వర్సెస్ హాంకాంగ్ టీ20
  • 40 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
India vs Hong Kong : పసికూన హాంకాంగ్‌పై టీమిండియా ఘనవిజయం.. చితక్కొట్టిన సూర్య కుమార్ యాదవ్..

Asia Cup India vs Hong Kong Highlights: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఆడిన మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన టీమిండియా.. తాజాగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బుధవారం (ఆగస్టు 31) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో హాంకాంగ్‌తో తలపడిన మ్యాచ్‌లో టీమిండియా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచి 'సూపర్ 4'లోకి దూసుకెళ్లింది.

ఆసియా కప్‌లో భాగంగా ఇండియా-హాంకాంగ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన హాంకాంగ్ జట్టు భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్ 36 (39), కెప్టెన్ రోహిత్ శర్మ 21 (13) పరుగులతో ఫర్వాలేదనిపించగా... విరాట్ కోహ్లి (59), సూర్య కుమార్ యాదవ్ (68) అర్థ శతకాలు సాధించారు. విరాట్ ఇన్నింగ్స్‌లో 3 సిక్సులు, ఒక ఫోర్ ఉన్నాయి. ఇక సూర్య కుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఏకంగా 6 సిక్సులు, 6 ఫోర్లు బాదాడు. ఇందులో 4 సిక్సులు చివరి ఓవర్‌లోనే బాదడం విశేషం. కేవలం 26 బంతుల్లోనే 68 పరుగులు చేయడం విశేషం. ఈ ఇద్దరూ దూకుడుగా ఆడటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు సాధించగలిగింది. 

పసికూన హాంకాంగ్ జట్టు భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించలేకపోయినప్పటికీ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. హాంకాంగ్ బ్యాట్స్‌మెన్‌లో బాబర్ హయత్  41(35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కించిత్ షా 30 (28) పరుగులతో రాణించాడు.టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్, అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. టీమిండియా భారీ స్కోర్‌ చేయడంలో కీలకంగా వ్యవహరించిన సూర్య కుమార్ యాదవ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

ఆసియా కప్ 'సూపర్ 4' మ్యాచ్‌లు సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 9 వరకు జరగనున్నాయి. గ్రూప్ ఏ నుంచి రెండు జట్లు, గ్రూప్ బీ నుంచి రెండు జట్లు సూపర్ ఫోర్‌లో తలపడుతాయి. సూపర్ ఫోర్‌లో టాప్‌లో నిలిచే రెండు జట్లు ఫైనల్‌లో తలపడుతాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. 

Also Read: Rishabh Pant: టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో రిషబ్ పంత్‌కు స్థానం లేదు: మాజీ సెలక్టర్‌

Also Read:  Horoscope Today September 1st 2022: నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారు తాము ప్రేమించే వ్యక్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News