Sovereign Gold Bond Scheme : గోల్డ్ ఇన్వెస్టర్స్‌కు గుడ్ న్యూస్.. నేటి నుంచి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ రెండో సిరీస్.. కస్టమర్స్ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే

Sovereign Gold Bond Scheme : నేటి నుంచి ఎస్‌జీబీ (Sovereign Gold Bond) రెండో సిరీస్ ప్రారంభం కానుంది. అసలు సావరిన్ గోల్డ్ బాండ్ అంటే ఏమిటి.. ఎలా కొనుగోలు చేయాలి.. తదితర వివరాలు మీకోసం

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 22, 2022, 10:17 AM IST
  • గోల్డ్ ఇన్వెస్టర్స్‌కు గుడ్ న్యూస్..
  • నేటి నుంచి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ రెండో సిరీస్ ప్రారంభం
  • ఆగస్టు 22 నుంచి ఆగస్టు 26 వరకు
Sovereign Gold Bond Scheme : గోల్డ్ ఇన్వెస్టర్స్‌కు గుడ్ న్యూస్.. నేటి నుంచి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ రెండో సిరీస్.. కస్టమర్స్ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే

 Sovereign Gold Bond Scheme : సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇది రెండో సిరీస్. నేటి (ఆగస్టు 22) నుంచి ఆగస్టు 26 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. బంగారంపై పెట్టుబడి పెట్టే ఆసక్తి ఉన్నవారికి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ బెస్ట్ ఛాయిస్ అని నిపుణుల అభిప్రాయం.ఈ ఆర్థిక సంవత్సరానికి సావరిన్ గోల్డ్ బాండ్ మొదటి విడత స్కీమ్‌ను ఆర్‌బీఐ ఈ ఏడాది జూన్‌లో చేపట్టింది. తాజాగా విడుదల చేసిన రెండో విడత స్కీమ్‌కి సంబంధించి ముఖ్య విషయాలను, దీని ద్వారా పొందే బెనిఫిట్స్‌ను ఇప్పుడు పరిశీలిద్దాం... 

అసలేంటి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ :

సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ (ఎస్‌జీబీ).. తెలుగులో సార్వభౌమ పసిడి బాండ్ల పథకం. ఈ స్కీమ్ ద్వారా బంగారాన్ని భౌతికంగా కాకుండా బాండ్ల రూపంలో కొనుగోలు చేయవచ్చు. ఒక్కో బాండ్ ఒక గ్రాము బంగారానికి సమానమైన విలువను కలిగి ఉంటుంది. ఇందుకు ఆర్‌బీఐ గ్యారెంటీ ఇస్తుంది. భారీ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ బాండ్లు ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే.. ఒకవేళ భౌతికంగా భారీ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసినట్లయితే.. సేఫ్టీ కోసం బ్యాంక్ లాకర్స్‌లో భద్రపరచాల్సి వస్తుంది. అందుకు బ్యాంక్ ఛార్జీలు చెల్లించక తప్పదు. భౌతిక బంగారానికి బదులు బాండ్స్ కొనుగోలు చేస్తే ఆ అవసరం ఏర్పడదు. 

సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్స్ బెనిఫిట్స్.. ముఖ్య విషయాలు :

సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ద్వారా ఇష్యూ చేసే బాండ్స్ 8 ఏళ్ల వరకు చెల్లుబాటు అవుతాయి. 8 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ పూర్తవుతుంది. మెచ్యూరిటీ సమయంలో అప్పటి ధర మేరకు బాండ్ల ధరను లెక్కగట్టి చెల్లింపులు జరుపుతారు. ఇందుకోసం ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ 999 స్వచ్చత బంగారంపై నిర్ణయించే ధరను పరిగణలోకి తీసుకుంటారు.  

ఈసారి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌లో ఒక గ్రాము బాండ్‌ ధరను రూ.5147గా నిర్ణయించారు.

సావరిన్ గోల్డ్ బాండ్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేవారికి, డిజిటల్ పద్దతిలో చెల్లింపులు జరిపేవారికి గ్రాము బంగారంపై రూ.50 తగ్గింపు అందిస్తారు.

సావరిన్ గోల్డ్ బాండ్స్‌ను స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SHCIL), క్లీనింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCIL), పోస్టాఫీసులు, పలు బ్యాంకులు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్, బీఎస్‌ఈ ద్వారా కొనుగోలు చేయవచ్చు. లేదా ఏజెంట్స్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

సావరిన్ గోల్డ్ బాండ్స్‌పై ఏడాదికి 2.50 వడ్డీ రేటు పొందుతారు. ఆర్నెళ్లకు ఒకసారి వడ్డీ చెల్లింపులు జరుపుతారు. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం దీనిపై వడ్డీకి ట్యాక్స్ వర్తిస్తుంది.

సావరిన్ గోల్డ్ బాండ్స్‌ను ఐదేళ్ల తర్వాత ఉపసంహరించుకోవచ్చు. ఎక్స్‌చేంజీలో లిస్టయిన వాటిని ఎక్స్‌చేంజీల ద్వారానే విక్రయించవచ్చు. ఈ రెండింటికీ పన్ను వర్తిస్తుంది.

సావరిన్ గోల్డ్ బాండ్స్‌పై లోన్లు కూడా పొందవచ్చు. సాధారణంగా బ్యాంకులు ఇచ్చే గోల్డ్ లోన్‌కు ఇది సమానంగా ఉంటుంది.

సావరిన్ గోల్డ్ బాండ్స్‌ కొనుగోలు చేయాలంటే కేవైసీ నమోదు తప్పనిసరి. ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, పాన్ కార్డు వివరాలు సమర్పించాలి. 

Also Read: Amit Shah Ntr Meet: అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ.. 20 నిమిషాల ఏకాంత చర్చలు.. ఇంతకీ ఏం మాట్లాడుకున్నారు..?

Also Read: Megastar Chiranjeevi rare photos: మీరెప్పుడూ చూడని మెగాస్టార్ ఫోటోలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News