Weight Reducing Tips: ఇలా చేస్తే..కేవలం నాలుగే నాలుగు వారాల్లో బరువు తగ్గడం ఖాయం

Weight Reducing Tips: వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి, పని ఒత్తిడి కారణంగా అధిక బరువు పెను సమస్యగా మారిపోయింది. ప్రతి ఒక్కరి వంటింట్లో లభించే కొన్ని వస్తువులతో అధిక బరువుకు చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా..ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 17, 2022, 11:48 PM IST
Weight Reducing Tips: ఇలా చేస్తే..కేవలం నాలుగే నాలుగు వారాల్లో బరువు తగ్గడం ఖాయం

Weight Reducing Tips: వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి, పని ఒత్తిడి కారణంగా అధిక బరువు పెను సమస్యగా మారిపోయింది. ప్రతి ఒక్కరి వంటింట్లో లభించే కొన్ని వస్తువులతో అధిక బరువుకు చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా..ఆ వివరాలు మీ కోసం..

చాలామంది బరువు తగ్గేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు డైటింగ్ చేస్తే..ఇంకొందరు గ్రీన్ టీ వంటివి తీసుకుంటుంటారు. మరి కొందరు వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, ఎక్సర్‌సైజ్ లేదా యోగా చేస్తుంటారు. కొంతమందికి ఎన్ని చేసినా ఫలితం కన్పించదు. అటువంటి పరిస్థితుల్లో రోజూ చేసే వివిధ రకాల వ్యాయామంతో పాటు కొన్ని మసాలా దినుసుల్ని డైట్‌‌లో చేర్చుకుంటే అద్భుతమైన ఫలితాలుంటాయి. కేవలం నాలుగే నాలుగు వారాల్లో బరువు తగ్గించుకోవచ్చు. కొన్ని రకాల మసాలా దినుసుల్ని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రుచి పెరగడమే కాకుండా బరువు వేగంగా తగ్గుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు కచ్చితంగా బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. ఎలా, ఏంటనేది పరిశీలిద్దాం.

జీలకర్రతో అద్భుత ఉపయోగం

ప్రధానంగా జీలకర్ర. ఇళ్లలో ప్రతిరోజూ వాడేదే. జీలకర్ర శరీర బరువును తగ్గించడంలో దోహదపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని జీలకర్ర మార్చగలుగుతుంది. ఇందులో ఉండే ఫైటోస్టెరాల్స్ కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. బరువు తగ్గేందుకు రోజూ జీలకర్ర నీటిని లేదా మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. జీర్ణక్రియను మెరుగుపర్చడం ద్వారా బరువు తగ్గుతారు. ఇక మరో ప్రధాన సుగంధ ద్రవ్యం..దాల్చిన చెక్క. శరీరంలోని చక్కెరను ప్రాసెస్ చేసేది దాల్చిన చెక్కే. శరీరంలో ఉండే షుగర్..కొవ్వుగా మారకుండా దాల్చిన చెక్క నిరోధిస్తుంది. దాల్చిన చెక్క కారణంగా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. 

పెప్పర్ టీతో..

ఇక మరో ముఖ్యమైంది నల్లమిరియాలు. శరీరంలో కొవ్వు కణాల ప్రక్రియను నిరోధిస్తాయి. ఎండుమిర్చి తినడం వల్ల కూడా కొవ్వు సంబంధిత సమస్యలు తలెత్తవు. తరచూ పెప్పర్ టీ తాగడం వల్ల ఇన్‌ఫెక్షన్స్ దూరమౌతాయి. నల్ల మిరియాల్ని వివిధ రకాల ఆహార పదార్ధాలతో కలిపి తీసుకోవచ్చు. మరో సుగంధ ద్రవ్యం యాలుక్కాయలు. జీర్ణక్రియకు ఇవి చాలా మంచిది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలుంటాయి. జీవక్రియను పెంచడమే కాకుండా ఆహారం సులభంగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. యాలుక్కాయల్ని ఏ రూపంలో తీసుకున్నా శరీరానికి మంచిదే. 

పసుపుతో..

ఇక బెస్ట్ యాంటీ బయోటిక్‌గా చెప్పుకునే పసుపు. పసుపు లేకుండా భారతీయ వంటలుండవు. పూర్తి ఆయుర్వేద గుణాలున్న పుసుపుతో శరీరంలో మంటలు వంటివి దూరమౌతాయి. పసుపు వివిధ రకాల విషపదార్ధాల్నించి మనల్ని కాపాడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. జీవక్రియ ఎప్పుడైతే మెరుగుపడిందో..సహజంగానే బరువు తగ్గుతారు. 

Also read: Cause Of Bloating: ఈ ఆహార పదార్థాలను విచ్చలవిడిగా తింటున్నారా.. అయితే ఈ పొట్ట సమస్యలు తప్పవు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News