IT raids in Hyderabad and AP: రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్‌పై ఇన్ కమ్ ట్యాక్స్ విభాగం అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. తెలంగాణ, ఏపీలో ఏకకాలంలో పది చోట్ల వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ కార్యాలయాలపై ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుండే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. వాసవి రియాల్టీ, వాసవి ఫిడిల్ వెంచర్స్, వాసవి నిర్మాన్, ఇండ్మాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, శ్రీ ముఖ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సంస్థల పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి ఇన్‌కం ట్యాక్స్ చెల్లించడంలో అవకతవకలకు పాల్పడ్డారని అరోపణలు వెల్లువెత్తాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద వెంచర్లు ఏర్పాటు చేసి కస్టమర్ల నుంచి వేల కోట్లలో డబ్బులు దండుకుంటున్న వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్.. ఆ ఆదాయంపై ఆదాయ పన్ను చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోందని ఆదాయ పన్ను శాఖ అధికారులు గ్రహించినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే వాసవి రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయాలు, యజమాని, సంస్థతో సంబంధం ఉన్న వారి నివాసాల్లోనూ సోదాలు చేపట్టినట్టు సమాచారం అందుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాసవి గ్రూప్స్ ఇప్పటి వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల గురించి స్పష్టమైన సమాచారం సేకరించిన అనంతరమే మరిన్ని ఇతర ఆధారాల కోసం ఐటీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది.
Also Read : Munugode ByPoll Live Updates: కోమటిరెడ్డితో పాటు బీజేపీలోకి మరో సీనియర్ నేత.. కాంగ్రెస్ లో పరేషాన్
Also Read : Ktr Tweet: గుజరాత్‌లో 11 మంది రేపిస్టులను రిలీజ్.. ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ కేటీఆర్ ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P2DgvH
Apple Link - https://apple.co/3df6gDq
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
IT Raids in TS and AP: తెలంగాణ, ఏపీలో ప్రముఖ రియల్ ఎస్టేట్ గ్రూప్‌పై ఐటి దాడులు