Indian Railways: రైల్వే శాఖ కీలకమైన నిర్ణయం తీసుకుంది. రైళ్లలో ఇకపై గార్డులు ఉండరు. రైల్వే గార్డులు ఇక నుంచి కొత్త రూపంలో, కొత్త పదవిలో కన్పించనున్నారు.
రైల్వేశాఖ కీలకమైన అప్‌డేట్ వెలువడింది. భారతీయ రైళ్లలో ఇక నుంచి రైల్వే గార్డులు ఉండరు. రైల్వే సిబ్బంది చిరకాల డిమాండ్ మేరకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే గార్డులు ఇక నుంచి కొత్త పదవిలో, కొత్త రూపంలో కన్పించనున్నారు. రైల్వై శాఖ రైల్వే గార్డు పదవిని మార్చింది. ఇప్పుడిక రైల్వే గార్డుల్ని ట్రైన్ మేనేజర్లుగా పిలుస్తారు. ఈ మార్పులో భాగంగా అందరికీ సంబంధిత పత్రాలు కూడా జారీ అయ్యాయి. గత కొన్నేళ్లుగా ఈ మార్పుపై రైల్వే సిబ్బంది అడుగుతూ వస్తున్నారు.
రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం తక్షణం అమలు కానుంది. వాస్తవానికి ఈ డిమాండ్‌పై ఈ ఏడాది ప్రారంభంలోనే రైల్వే శాఖ అంగీకరించింది. 2004 నుంచే రైల్వే గార్డుల పదవిని మార్చాలనే డిమాండ్ ఉంది. రైల్వే గార్డు అనే వ్యక్తి కేవలం సిగ్నల్ కోసం జెండా ఊపడం లేదా టార్చ్ చూపించడమే కాదని..అందుకే పదవి పేరు మార్చాలని సిబ్బంది కోరుతూ వచ్చారు.
ట్రైన్ మేనేజర్‌గా కొత్త బాధ్యతలు
రైల్వే శాఖ ఈ పోస్టు పేరు మార్చింది. ఇప్పుడు కొత్త బాధ్యతలు వచ్చాయి. రైళ్లలో ప్రయాణీకుల అవసరాలు పూర్తి చేయడంతో పాటు పార్శిల్ సామగ్రి పర్యవేక్షణ, యాత్రికుల సెక్యూరిటీ, రైళ్ల పర్యవేక్షణ ఉంటాయి. ఈ క్రమంలో పోస్టు పేరు మార్చడం సమంజసమేనని రైల్వే శాఖ భావించింది. ఇక గతంలో అసిస్టెంట్ గార్డ్ ఇప్పుడు అసిస్టెంట్ పాసెంజర్ ట్రైన్ మేనేజర్‌గా ఉంటాడు. గూడ్స్ గార్డు ఇకపై గూడ్స్ ట్రైన్ మేనేజర్‌గా వ్యవహరిస్తాడు. సీనియర్ గూడ్స్ గార్డ్ సీనియర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్‌గా, సీనియర్ పాసెంజర్ గార్డు ఇకపై సీనియర్ పాసెంజర్ ట్రైన్ మేనేజర్‌గా వ్యవహరించనున్నారు.
Also read: ITR Rules Changed: ఐటీ రిటర్న్స్‌లో కొత్త నిబంధనలు, వెరిఫికేషన్‌కు ఇప్పుడు నెలరోజులే గడువు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook