Sun Transit 2022: సింహరాశిలో సూర్య సంచారం.. ఏ రాశికి లాభం? ఏరాశికి నష్టం?

Sun Transit 2022:  ఆగస్టు 17న సూర్యభగవానుడు  సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం ఏయే రాశిపై ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 15, 2022, 10:45 AM IST
Sun Transit 2022: సింహరాశిలో సూర్య సంచారం.. ఏ రాశికి లాభం? ఏరాశికి నష్టం?

Sun Transit for All Zodiac: సూర్యభగవానుడు మరో రెండు రోజుల్లో తన రాశిని మార్చనున్నాడు. 11 నెలల తర్వాత తన సొంతరాశి అయిన సింహరాశిలోకి (Sun Transit in leo 2022) ప్రవేశించనున్నాడు. ఆగస్టు 17న సూర్యుడు కర్కాటక రాశిని విడిచిపెట్టి సింహరాశిలోకి వెళతాడు. ఆరాశిలో ఇప్పటికే బుధుడు ఉన్నాడు. ఇవి రెండూ కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరిచే అవకాశం ఉంది. సూర్య సంచారం ఏ రాశివారిపై ఎలాంటి ప్రభావం చూపించనుందో తెలుసుకుందాం. 

మేషం (Aries)- పోటీపరీక్షలకు సిద్దమవుతున్న యువత అనుకూల ఫలితాలు పొందుతారు. వ్యాపారవేత్తలు భారీగా లాభాలను ఆర్జిస్తారు. బిజినెస్ విస్తరించటానికి ఇదే మంచి సమయం. గర్బిణీ స్త్రీలు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. 
వృషభం (taurus) - వృషభ రాశి వారికి ఈ కాలంలో మానసిక గందరగోళం ఉంటుంది కాబట్టి కూల్ మైండ్ తో పని చేయండి. ఈ సమయంలో మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇంట్లో చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోవడం మంచిది, లేకుంటే అనవసరమైన ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంది.  
మిథునం (Gemini)- ఈ సమయం ఈ రాశివారికి కలిసివస్తుంది. అనారోగ్యం నుండి బయటపడతారు. ఆర్థికంగా మెరుగుపడతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. 
కర్కాటకం (Cancer)- ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి.  బాగా ఆలోచించి ముందడుగు వేయాలి.
సింహ రాశి (Leo)- ఈ రాశి వారు మీ బాస్ చెప్పినట్లు వ్యవహారిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీ భార్య జాబ్ చేయాలనుకుంటే ఆమెకు సహకరించండి. ఈ రాశి వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. వీరి ఆరోగ్యం బాగానే ఉంటుంది. తండ్రిని గౌరవించండి. 
కన్య (Virgo)- ఈ సమయంలో కన్యా రాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని  జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ కాలంలో దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
తులరాశి (Libra)- ఈ రాశివారికి కొత్త జాబ్ వస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రమోషన్ రావచ్చు. రచయితలకు అవార్డు వచ్చే అవకాశం ఉంది. పూర్వీకుల వ్యాపారం కలిసి వస్తుంది. 

వృశ్చికం (Scorpio)- ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. పదోన్నతి లభించే అవకాశం ఉంది. వీరు ప్రతిపనిలోనూ విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. 
ధనుస్సు (Sagittarius)- ఈ సమయంలో వీరి ఆదాయం తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బును  తెలివిగా ఖర్చు చేయండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో సంబంధాలు కొనసాగించండి. 
మకరం (Capricron)- ఈ టైం మీకు పెద్దగా కలిసిరాకపోవచ్చు. మకర రాశి వారు తమ ఆరోగ్యం పట్ల అజాగ్రత్త ఉండకండి.  శత్రువులతో కేర్ పుల్ గా నడుచుకోండి. 
కుంభం (Aquarius)- ఈ రాశివారికి కష్టపడితేనే విజయం లభిస్తుంది. ఆగస్ట్ 17 నుండి తెలివిగా వ్యాపారం చేయాలి లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ద వహించండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. 
మీనం (Pisces)- కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. మీ ప్రతిష్ట పెరుగుతుంది.

Also Read: Sun Transit effect on Scorpio: సూర్యుడి రాశి మార్పు.. ఆగస్టు 17 నుండి ఈ రాశివారికి డబ్బే డబ్బు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News