Naga Chaitanya Bollywdood Debut horribly went wrong: నాగచైతన్య తన బాలీవుడ్ ఎంట్రీ తాజాగా విడుదలైన లాల్ సింగ్ చడ్డా సినిమాతో ప్లాన్ చేసుకున్నారు. నిజానికి ఆరు ఆస్కార్ అవార్డులు సాధించిన ఫారెస్ట్ గంప్ సినిమాకి రీమేక్ అలాగే అమీర్ ఖాన్ సరసన పాత్ర అంటే సాధారణంగా పెద్దగా ఆలోచనలు లేకుండానే సినిమా చేసేయవచ్చు. అయితే నాగచైతన్యకు ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. మరి ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు నాగచైతన్య చేసిన పాత్ర అస్సలు నచ్చదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాకి వస్తున్న దారుణమైన రివ్యూల సంగతి పక్కన పెడితే నాగచైతన్య పాత్ర చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
నాగచైతన్య ఆర్మీలో పనిచేసే బాలరాజు అనే తూర్పుగోదావరి జిల్లా బోడిపాలెం అనే గ్రామానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తాడు. అతని నోటి వెంట 20 డైలాగులు పలికిస్తే అందులో 15 పైగా చెడ్డి బనియన్ అనే మాట లేకుండా లేవు. బాలరాజు తాతల కాలం నుంచి బనియన్లు, చెడ్డీలు తయారు చేసే పనిలో ఉంటారు. బహుశా అందుకే బాలరాజు పలికిన డైలాగులన్నీ ఈ చెడ్డి, బనియన్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. పోనీ డైలాగులు సంగతి పక్కన పెడితే నాగచైతన్య ఆహార్యం కూడా ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.
కచ్చితంగా ఇది ఒక ట్రోల్ మెటీరియల్ అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. బాలరాజు తండ్రి తాత ముత్తాత పాత్రలలో కూడా నాగచైతన్య కనిపిస్తాడు. వాటిని భవిష్యత్తులో ఆయనను ట్రోల్ చేసేందుకు వాడతారు అనడంలో సందేహం అక్కర్లేదు. ఈ పాత్రను నిజానికి విజయ్ సేతుపతి, హీరో నాని ఇద్దరికీ కూడా ముందుగా ఆఫర్ చేశారట. ఆ ఇద్దరూ చేయలేమని చెప్పడంతో ఆ పాత్ర చివరికి నాగచైతన్యదాకా వచ్చింది. నాగచైతన్య మొహమాటానికి పోయి సినిమా చేశాడో లేక కాస్త అవ లక్షణాలతో కూడిన పాత్ర చేసి అందరూ(రామ్ చరణ్-రంగస్థలం, పుష్ప- అల్లు అర్జున్) హిట్లు కొడుతున్నారు నేనెందుకు హిట్టు కొట్టను అనుకున్నాడో తెలియదు.
కానీ కాస్త పళ్లెత్తుతున్న క్యారెక్టర్ చేసి చెడ్డీ బనియన్ అంటూ డైలాగులు చెప్పి ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయింది. మొత్తానికి నాగచైతన్య పర్ఫామెన్స్ విషయంలో ఆయన అభిమానులు కూడా ఏమాత్రం సంతోషంగా లేరు. ఇలాంటి సినిమా చేసి ఉండకూడదని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. మరి భవిష్యత్తులో అయినా ఇలాంటి పాత్రలు వచ్చిన సమయంలో నాగచైతన్య కాస్త ఆచితూచి నిర్ణయం తీసుకుంటే అభిమానులు కాస్త ఇబ్బంది పడకుండా ఉంటారు లేదంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మొహానికి పోయి చేయకుండా పాత్ర నచ్చితేనే చేస్తే ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు.
Also Read: Chiranjeevi: చిరంజీవి ప్రమోట్ చేస్తే సినిమా ఫట్టేనా.. అసలేమవుతోంది?
Also Read: Macherla Niyojakavargam: అమెరికా ప్రీమియర్ షోలన్నీ రద్దు.. అసలు ఏమైందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.