Serena Williams Retirement: అమెరికా టెన్నిస్ సంచలనమైన సెరేనా విలియమ్స్ సంచలన ప్రకటన చేసింది. త్వరలో రిటైర్మెంట్ తీసుకున్నట్టు ప్రకటించి..అభిమానుల్ని నిరాశకు గురి చేసింది. గ్రాండ్ స్లామ్ టోర్మమెంట్ అనంతరం ఆటకు దూరం కానుంది..
సెరేనా విలియమ్స్. టెన్నిస్‌లో ఓ సంచలనం. అమెరికాకు చెందిన ఈ 40 ఏళ్ల సెరేనా విలియమ్స్ 23 సార్లు గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు హఠాత్తుగా రిటైర్ అవుతున్నట్టు ప్రకటించి సంచలనం రేపింది. వోగ్ సెప్టెంబర్ నెల కవర్ పేజ్‌పై ప్రచురితమైన తరువాత టెన్నిస్ స్టార్ సెరేనా విలియమ్స్ రిటైర్మెంట్ ప్రకటన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. త్వరలో జరగనున్న గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ తరువాత టెన్నిస్ ఆటకు దూరం కానున్నట్టు తెలిపింది.
జీవితంలో ఏదో ఒక సమయంలో విభిన్నమైన మార్గంలో ముందుకు సాగాలనే నిర్ణయం తీసుకోవల్సి వస్తుందని సెరేనా విలియమ్స్ తెలిపింది. ఆ నిర్ణయం లేదా ఆ సమయం కఠినంగా ఉండవచ్చని వెల్లడించింది. నాకు టెన్నిస్ క్రీడలో ఆనందం కలుగుతుంది కానీ ఇప్పుడు కౌంట్‌డౌన్ ప్రారంభమైపోయింది. త్వరలో ఆటకు దూరం అంటూ పోస్ట్ పెట్టగానే వైరల్ అయిపోయింది.
విలియమ్స్ చాలాకాలంగా తనదైన శైలిలో టెన్నిస్ ఆడలేకపోతోంది. సెరేనా విలియమ్స్ వింబుల్డన్ ఓపెన్‌లో ఈసారి తొలిరౌండ్తోనే నిష్క్రమించింది. ఓ తల్లిగా, ఆధ్యాత్మిక లక్ష్యాల్ని సాధించేందుకు రిటైర్మెంట్ నిర్ణయం తప్పడం లేదని తెలిపింది.
సెరేనా విజయ పరంపర
23 సార్లు సెరేనా విలియమ్స్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ గెలిచింది. 2003, 2005, 2007, 2009, 2010, 2015, 2017లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచింది. ఇక 2002, 2013, 2015లో ఫ్రెంచ్ ఓపెన్ గెలవగా, 2022, 2003, 2009, 2010, 2012, 2015, 2016లో వింబుల్డన్ ట్రోఫీ సాధించింది. అటు 1999, 2022, 2008, 2012, 2013, 2014లో యూఎస్ ఓపెన్ కైవసం చేసుకుంది.
Also read: Ind vs Pak: భారత్, పాక్ మ్యాచ్‌కు కౌంట్ డౌన్ మొదలు..తాజాగా మరో వీడియో వైరల్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook