Pigeon Signs of Good Luck: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రం, వాస్తుశాస్త్రాల ప్రాధాన్యత ఎక్కువ. కొన్ని రకాల పక్షులు, చెట్లు శుభ సూచకంగా భావిస్తారు. అదే సమయంలో పావురం తరచూ ఇంటికి వస్తుంటే దేనికి సంకేతం, శుభానికా లేదా అశుభానికా..ఏం జరుగుతుంది.
ఇంటి చుట్టూ జరిగే పరిణామాలు లేదా ఇంటి చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి ఆ ఇంటికి శుభం జరుగుతుందా, అశుభం వెంటాడుతుందా అనే వివరణ జ్యోతిష్యశాస్త్రం లేదా వాస్తుశాస్త్రంలో ప్రత్యేకంగా ఉంటుంది. కొన్ని వస్తువులు వాడకం లేదా కొన్ని జీవాల రాకపోకలు కూడా శుభాశుభాలకు సూచకాలు. మరి అదే సమయంలో పావురం తరచూ మీ ఇంటికి వస్తుంటే..దేనికి సంకేతం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పావురం తరచూ ఇంటికి వస్తుంటే..మీ జీవితం మారిపోతుందని ఆర్ధమట. పావురం ఈకతో చిన్న పని చేస్తే..అంతులేని సంపద మీ సొంతమౌతుందని కూడా ఉంది.
ఇంటికి తరచూ పావురాలు లేదా పావురం వస్తూ పోతూ ఉంటే..అత్యంత శుభసూచకమని అర్ధం. పావురం ఈకతో ఇలా చేస్తే ధనసంపదలతో తులతూగుతారు. అవును జ్యోతిష్యశాస్త్రంలో అలానే ఉంది. పావురం ఈకతో ఏం చేస్తే సంపద లభిస్తుందో తెలుసుకుందాం...
1. మీరు డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతుంటే..పావురం ఈకతో మీ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. పావురం ఈకను ఇంటి ఖజానాలో దాచుకోవాలి. పావురం ఈకను తెలుపు లేదా ఎరుపు రంగు వస్త్రంలో మడిచి..లక్ష్మీదేవిని పూజించి..ఎర్రదారం కట్టి డబ్బులు దాచే చోట పెట్టాలి. అయితే పావురం ఈకను మీరు పెట్టే ప్రాంతంపై మరెవరి దృష్టి పడకుండా చూసుకోవాలి.
2. ఇంటికి పావురం వస్తూ పోతూ ఉంటే..అది అత్యంత శుభదాయకం. ఎందుకంటే పావురం అనేది ఈశ్వరుడి సందేశవాహకంగా భావిస్తారు. జ్యోతిష్యం ప్రకారం పావురం ఇంట్లో రావడమంటే శుభాన్ని తీసుకొస్తుందని అర్ధం.
3. మీ ఇంట్లో పావురం గుడ్లు పెడితే మీకు చాలా కీలకమైన శుభవార్త వస్తుందని అర్ధం.
4. పావురం ఈక అనేది అప్పుల్నించి విముక్తిడిని చేస్తుందట. అందుకే పావురం ఈకల్ని ఇంట్లో వేర్వేరు మూలల్లో పెట్టాలి. ఒక ఈకను లివింగ్ రూమ్‌లో దక్షిణమూలన ఉంచాలి. మరో ఈకను వంటింట్లో ఉత్తరమూలన ఉంచాలి. మూడవ ఈకను బెడ్రూమ్లో తూర్పు దిశలో ఉంచాలి. దీనివల్ల పెండింగులో ఉన్న డబ్బులు తిరిగొస్తాయి. డబ్బు కొరత పోతుంది.
5. ఉద్యోగం కోసం అణ్వేషిస్తుంటే గురువారం నాడు పసుపు కొమ్మును పసుపు వస్త్రంలో పావురం ఈకతో...పసుపు గవ్వతో చుట్టి ఖజానాలో ఉంచుకోవాలి. దీనివల్ల త్వరగానే ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు.
Also read: Rakshabandhan 2022: రక్షాబంధన్ ఆగస్టు 11 లేదా ఆగస్టు 12 ఎప్పుడు, శుభ ముహూర్తాలు ఎప్పుడెప్పుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook