Jupiter in Pisces Effect: గురుడి మీనరాశి ప్రవేశం, ఆ మూడు రాశులకు మరో మూడు నెలల వరకూ ఊహించని డబ్బు

Jupiter in Pisces Effect: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి రాశి స్థాన చలనం జరుగుతూ ఉంటుంది. ప్రతి గ్రహం రాశి మారుతుంటుంది. గురుగ్రహం మీనరాశిలో వక్రావస్థ కారణంగా కొన్ని రాశులపై అధిక ప్రభావం పడనుంది. అంతులేని ధనం సొంతం కానుంది. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 4, 2022, 07:09 PM IST
Jupiter in Pisces Effect: గురుడి మీనరాశి ప్రవేశం, ఆ మూడు రాశులకు మరో మూడు నెలల వరకూ ఊహించని డబ్బు

Jupiter in Pisces Effect: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి రాశి స్థాన చలనం జరుగుతూ ఉంటుంది. ప్రతి గ్రహం రాశి మారుతుంటుంది. గురుగ్రహం మీనరాశిలో వక్రావస్థ కారణంగా కొన్ని రాశులపై అధిక ప్రభావం పడనుంది. అంతులేని ధనం సొంతం కానుంది. ఆ వివరాలు మీ కోసం..

హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి గ్రహానికి ప్రతి రాశికి విశేష మహత్యముంది. ఏదైనా గ్రహం రాశి మారినప్పుడు లేదా రాశిలోకి వక్రావస్థ జరిగినప్పుడు ఆ ప్రభావం మిగిలిన రాశులపై అనుకూలంగా, ప్రతికూలంగా పడుతుంది. జూలై 29వ తేదీన మీనరాశిలో గురుగ్రహం వక్రావస్థలో వచ్చింది. 108 రోజుల వరకూ అదే స్థితిలో ఉండనున్నాడు. ఈ ప్రభావం నేరుగా కొన్ని రాశుల జీవితాలపై పడనుంది. 

జ్యోతిష్యం ప్రకారం గురుగ్రహమంటే జ్ఞానం, అభివృద్ధి లేదా ప్రగతి, చదువు, ధనం, దానం, పుణ్యాలతో సంబంధం కలిగి ఉంటుంది. అదుకే ఈ గ్రహం వక్రమార్గంతో అన్ని రాశులపై పాజిటివ్ లేదా నెగెటివ్ ప్రభావం పడుతుంది. 3 రాశులవారికి మాత్రం అంతులేని ధన సంపద, సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆ రాశుల గురించి తెలుసుకుందాం..

వృషభరాశివారికి అంతా అనుకూలంగా ఉంటుంది. గురువు ఈ రాశిలో 11 వ స్థానంలో వక్రీకరణ కారణంగా అంతులేని ధన సంపదలు లభిస్తాయి. ఎందుకంటే ఈ స్థానం డబ్బు, ఆదాయానికి సంబంధించినది. గురువు వక్రీకరణతో ఆదాయం పెరుగుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. చేపట్టే కార్యక్రమాలు విజయవంతమౌతాయి. గురువు వక్రీకరణ కారణంగా పనిచేసే చోట ప్రశంసలు లభిస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఇది అత్యంత అనువైన సమయం. 

గురువు వక్రీకరణ కారణంగా మిధున రాశి జాతకుల జీవితంలో మార్పులు వస్తాయి. గురుగ్రహం దశమ స్థానంలో వక్రీకరణ కావడం వల్ల ఉద్యోగాలు వ్యాపారాలు, పనిచేసే ప్రాంతాలపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇంక్రిమెంట్లు అనుకున్నట్టుగా ఉంటాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. గురువు వక్రీకరణ వల్ల వ్యాపారం మరింతగా పెరుగుతుంది. మార్కెటింగ్, మీడియా సంబంధిత వ్యక్తులకు లాభాలు కలుగుతాయి. మిధునరాశిపై బుధుడి ఆధిపత్యం ఉంటుంది. 

ఇక కర్కాటక రాశివారికి అంతా అదృష్టమే.విదేశీయాత్రకు అవకాశాలుంటాయి.పెండింగ్ పనులు పూర్తవుతాయి. వ్యాపార నిమిత్తం యాత్రలు చేపడతారు. ఈ యాత్ర మీకు ప్రయోజనం కల్గించనుంది. విదేశీ వ్యాపారాల్లో ఊహించని లాభాలుంటాయి. ముఖ్యంగా మీ ప్రత్యర్ధులపై రాణిస్తారు. అంటే విజయం లభిస్తుంది.

Also read: Sun and Venus Conjunction: సింహరాశిలో..సూర్య, శుక్ర గ్రహాల కలయిక, ఆ 4 రాశులకు ఆగస్టు 31 నుంచి ఊహించని సంపద

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News