Surya Budh Gochar 2022: ఆగస్టులో ఈ 2 రాశుల వారి అదృష్టం ప్రకాశించబోతుంది!

Surya Budh Gochar 2022: ఈ నెలలో బుధుడు మరియు సూర్యుడు రాశిచక్రాన్ని మార్చబోతున్నారు. వీటి సంచారం రెండు రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది. ఈ రెండు రాశుల కెరీర్ అద్భుతంగా ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 2, 2022, 11:31 AM IST
Surya Budh Gochar 2022: ఆగస్టులో ఈ 2 రాశుల వారి అదృష్టం ప్రకాశించబోతుంది!

Surya Budh Gochar 2022: ఆగస్టు నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశిని మార్చబోతున్నాయి. దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో సూర్యుడు,బుధ గ్రహాలు తమ స్థానాన్ని మార్చనున్నాయి. ఆగస్టు 17న సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి తన సొంతరాశి అయిన సింహరాశిలోకి (Sun transit in leo 2022) ప్రవేశిస్తాడు. మరోవైపు ఆగస్టు 21న బుధగ్రహం కన్యా రాశిలోకి (Mercury transit in Virgo 2022) ప్రవేశించనుంది. ఈ గ్రహాల మార్పు వల్ల ముఖ్యంగా 2 రాశులవారు లాభ పడనున్నారు. అవే సింహ రాశి మరియు కన్య రాశి. 

సింహ రాశి (Leo): సూర్యభగవానుడు ఆగస్టు 17వ తేదీ ఉదయం 07:14 నిమిషాలకు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. సింహరాశికి అధిపతి సూర్యుడు. సొంతరాశిలోనే సూర్యుడు సంచారం వల్ల ఈ రాశివారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. సూర్య సంచారం వల్ల ఆగస్టు 17 నుండి సింహరాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వీరి కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ రాశివారు పెద్ద పదవులను పొందే అవకాశం ఉంది. 

కన్య రాశి (Virgo): కన్య రాశి వారికి ఆగష్టు మాసం ఆనందాలను తెస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధ గ్రహ సంచారం ఆగష్టు 21 రాత్రి 01:55 గంటలకు జరుగుతుంది. ఈ సమయంలో బుధుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. కన్యరాశిని పాలించే గ్రహం మెర్య్కూరీ.  బుధ గ్రహ సంచారం ఈ రాశివారికి కలిసి వస్తుంది. ఈ రాశివారు న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. అపారమైన డబ్బు సంపాదిస్తారు. కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. కెరీర్ లో పురోగతి ఉంటుంది. బుధుడి అనుగ్రహంతో మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.  

Also Read: Venus Transit 2022: ఆగస్ట్ 7 నుంచి 23 రోజులపాటు ఈ రాశులపై డబ్బు వర్షం! 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News