Hyderabad Rains LIVE Updates: హైదరాబాద్‌లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. సోమవారం (ఆగస్టు 1) నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మల్కాజ్‌గిరి పరిధిలోని పలు కాలనీల్లోకి మురుగు నీరు చేరింది. షిర్డీ నగర్, సఫిల్ కాలనీ మధ్య ఉన్న నాలా నుంచి వరద కాలనీల్లోకి వచ్చింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో నిన్న అత్యధికంగా ఈస్ట్ ఆనంద్ బాగ్‌లో 8.4 సెం.మీ వెస్ట్ మారేడ్‌పల్లిలో 8.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఈసారి సీజన్ ఆరంభంలోనే తెలంగాణను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణలో భారీ వర్షాలపై లైవ్ అప్‌డేట్స్ మీకోసం...
Hyderabad Rains LIVE Updates: హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..