Sanju Samson replaces KL Rahul for West Indies T20I Series: కేరళ వికెట్ కీపర్, టీమిండియా యువ బ్యాటర్ సంజూ శాంసన్‌ను అదృష్టం వరించింది. ఎప్పుడూ జట్టులో చోటు కోసం వేయి కళ్లతో ఎదురుచూసే శాంసన్‌కు.. వెస్టిండీస్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కూడా నిరాశే ఎదురైంది. అయితే కరోనా వైరస్ నుంచి కోలుకున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో.. శాంసన్‌కు అనూహ్యంగా భారత టీ20 జట్టులో చోటు దక్కింది. వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్ జట్టులో సంజూ ఉన్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2022 తర్వాత కేఎల్ రాహుల్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. జూన్ నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో కెప్టెన్‌గా ఆడాల్సి ఉన్నా.. గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమయ్యాడు. జర్మనీ వెళ్లి గాయానికి చికిత్స తీసుకుని వచ్చిన రాహుల్.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో శిక్షణ (ప్రాక్టీస్, ఫిట్‌నెస్) పొందాడు. అయితే వెస్టిండీస్ టూర్‌కు సిద్ధమయ్యేలోపే అతడు కరోనా బారిన పడ్డాడు. దాంతో కరేబియన్ టూర్‌కు వెళ్లలేకపోయాడు. రాహుల్ కోలుకోవడానికి మరో వారం పడతుందని బీసీసీఐ వైద్య బృందం తేల్చింది. దాంతో రాహుల్ స్థానంలో సంజూ శాంసన్‌ను టీ20 జట్టుకు బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు.
సంజూ శాంసన్‌ను వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ కోసం బీసీసీఐ శుక్రవారం జట్టులో చేర్చింది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించలేదు. శాంసన్‌కు తుది జట్టులో అవకాశాలొస్తే.. తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే త్వరలో టీ20 ప్రపంచకప్ 2022 ఉంది. జట్టులో ప్రస్తుతం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో సంజూ ఏదైనా మాయ చేస్తే గానీ జట్టులో చోటుండదు. ఏదేమైనా ఈ అవకాశం శాంసన్‌కు రావడం అదృష్టమనే చెప్పాలి. నక్క తోక తొక్కిన సంజూ శాంసన్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
భారత టీ20 జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్.
Also Read: Wrong Challan: ఇలా చేస్తే.. మీ చలాన్‌లు కట్టాల్సిన అవసరం లేదు!
Also Read: Arpita Mukherjee: అర్పితా ముఖర్జీ ఇంట్లో 'ఆ' టాయ్స్.. పార్థబాబు కోరిక తీర్చలేదా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Sanju Samson India: నక్క తోక తొక్కిన సంజూ శాంసన్.. అనూహ్యంగా భారత టీ20 జట్టులో చోటు
నక్క తోక తొక్కిన సంజూ శాంసన్
అనూహ్యంగా భారత టీ20 జట్టులో చోటు
భారత టీ20 జట్టు ఇదే